ASHWIN: సరికొత్త వివాదంలో అశ్విన్
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. కాంచీపురంలోని రాజలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న ఆయన.. హిందీ మన జాతీయ భాష కాదంటూ కామెంట్స్ చేశారు. హిందీ కేవలం ఓ అధికారిక భాష మాత్రమే అన్నారు. అయితే, తన క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ కాలం పాటు తాను ఇంగ్లిష్, హిందీ మాత్రమే మాట్లాడేవాడినని చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అశ్విన్ చేసిన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ మాజీ సీనియర్ క్రికెటర్ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అంటున్నారు.
అదే జరిగితే నా పేరు మార్చుకుంటా: అశ్విన్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పంత్ ఏం చేయాలనేది మనం సరైన పద్దతిలో చెప్పాలి. అతడు అన్ని రకాల షాట్లను ఆడగలడు. పంత్ డిఫెన్స్ మోడ్‌లో 200 బంతులు ఎదుర్కొంటే ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేయగలడు. అందుకే, ప్రస్తుత క్రికెటర్లలో పంత్ డిఫెన్స్ అద్భుతం. అతడు 10 సార్లు బంతిని డిఫెన్స్ ఆడుతూ ఒక్కసారి ఔటైనట్లు నాకు చూపిస్తే నా పేరు మార్చుకుంటా.’ అని పేర్కొన్నారు.
తర్వాతి కెప్టెన్‌గా బుమ్రా అవ్వవచ్చు: గవాస్కర్
భారత క్రికెట్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'బుమ్రా రోహిత్ శర్మ వారసుడిగా కెప్టెన్సీని చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. జట్టును బుమ్రా అద్భుతంగా నడిపించగలడు. అతను ఆటగాళ్లపై ఒత్తిడి సృష్టించకుండా తెలివిగా వ్యవహరిస్తాడు. అతను త్వరలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే అది నాకు ఆశ్చర్యం కలిగించదు.' అని గవాస్కర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com