IPL: తొలి మ్యాచ్‌లోనే అద్భుతం.. ఎవరీ అశ్వనీ కుమార్..?

కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఈ అశ్వనీ కుమార్ ఎవరనే చర్చ క్రికెట్ ప్రపంచంలో ఆరంభమైంది. 23 ఏళ్ల ఈ అశ్వనీ కుమార్ పంజాబ్‌లోని మొహలీకి చెందిన వాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంజాబ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో పంజాబ్ తరఫున సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడాడు. ముఖ్యంగా షేర్-ఎ-పంజాబ్ టీ20 క్రికెట్ లీగ్‌లో సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ చాలా మందిని ఆకట్టుకుంది.
రూ. 30 లక్షలకు దక్కించుకున్న ముంబై
పంజాబ్ టీమ్ 2024లో అశ్వనీ కుమార్‌ను వేలంలో దక్కించుకుంది. అయితే అప్పుడు అశ్వనీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2025లో జరిగిన మెగా వేలంలో ముంబై టీమ్ అశ్వనీ కుమార్‌ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లో ఆడే అవకాశం అశ్వనీకి రాలేదు. తాజాగా వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో అశ్వనీకి అవకాశం ఇచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని అశ్వనీ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి బంతికే కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రాహానే వికెట్ తీశాడు. తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. ఈ నయా పేసర్ రాకతో ముంబై ఇఁడియన్స్ జట్టులో మరో స్టార్ బౌలర్ చేరినట్లయింది. ఇప్పటికే ముంబై ఇండియస్ జట్టులో హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్డ్, మిచెల్ శాంట్నర్ కు తోడుగా ఇప్పుడు అశ్వనీ కుమార్ చేరాడు. 2025లో జరిగిన మెగా వేలంలో ముంబై టీమ్ అశ్వనీ కుమార్‌ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లో ఆడే అవకాశం అశ్వనీకి రాలేదు. తాజాగా వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో అశ్వనీకి అవకాశం ఇచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని అశ్వనీ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
తొలి మ్యాచ్‌లోనే అద్భుతం
యువ సంచలనం అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల IPL చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. KKRతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌లో తొలి బంతికే KKR కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేశాడు. రెండో ఓవర్‌లో రింకూ సింగ్‌తో పాటు మనీష్ పాండేను పెవిలియన్ చేర్చాడు. మూడో ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అరటి పండు తిని అద్భుతం చేశాడు
IPL 2025 సీజన్‌లో భాగంగా KKRపై తన ప్రదర్శనపై అశ్వని కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు తొలి మ్యాచ్ కవాడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని, కానీ జట్టు వాతావరణం తనపై ఒత్తిడిని తగ్గించిందన్నాడు. భోజనం కూడా చేయలేదని, అరటి పండు మాత్రమే తిని ఈ మ్యాచ్ ఆడానని చెప్పాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే ఒత్తిడితో తనకు ఆకలి కూడా వేయలేదన్నాడు. మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగుకు 4 వికెట్లు పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com