క్రీడలు

ఆనాటి ఆ తండ్రి కష్టమే ఈ రవికుమార్ దాహియా.. కొడుకు కోసం 40కిలోమీటర్లు..!

ఆ తండ్రి కష్టం ఊరికే పోలేదు. రోజూ నలబై కిలోమీటర్లు నడిచి వచ్చి తనకు పాలు, పండ్లు ఇచ్చేవాడు. ఆ తండ్రి అలా కష్టపడి పెంచిన ఆ తనయుడిని చూసి దేశం మొత్తం ఇప్పుడు గర్విస్తుంది.

ఆనాటి ఆ తండ్రి కష్టమే ఈ రవికుమార్ దాహియా.. కొడుకు కోసం 40కిలోమీటర్లు..!
X

ఆ తండ్రి కష్టం ఊరికే పోలేదు. రోజూ నలబై కిలోమీటర్లు నడిచి వచ్చి తనకు పాలు, పండ్లు ఇచ్చేవాడు. ఆ తండ్రి అలా కష్టపడి పెంచిన ఆ తనయుడిని చూసి దేశం మొత్తం ఇప్పుడు గర్విస్తుంది. అతడు సాధించిన విజయానికి యావత్ దేశం మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది. ఇంతకీ ఎవరీ రవికుమార్ దహియా? ఎక్కడి నుంచి వచ్చాడు? అతని నేపధ్యం ఏంటి అనే చర్చ ఇప్పుడు అందరిలో మొదలైంది.

ఈ రోజు టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన రెజ్లింగ్ పోటీలో కొలంబియా, బల్గేరియా మరియు కజకిస్తాన్ రెజ్లర్‌లను ఓడించి భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. రవికుమార్ దహియా ఫైనల్‌‌కి చేరుకోవడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతుంది. రవికుమార్ దహియా తన అద్భుతమైన ప్రదర్శనతో దేశానికి మరో పతకాన్ని అందించాడని సంబర పడుతున్నారు. ఇక ఫైనల్ లో గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడితే సిల్వర్ మెడల్ వస్తుంది. అంటే భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరుతుంది అన్నమాట.

ఇప్పటివరకు రవికుమార్ దహియా ఒక భారతీయ రెజ్లర్ అని మాత్రమే అందరికీ తెలుసు కానీ.. అతని నేపధ్యం చాలా మందికి తెలియదు. హర్యానాకు చెందిన రవికుమార్ దహియా 12 డిసెంబర్ 1997న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రాకేశ్ దహియా.. ఈయన వ్యవసాయం చేసేవారు. సొంతంగా భూమి లేదు. పొలాన్ని అద్దెకి తీసుకొని వ్యవసాయం చేసేవాడు.. అంటే కౌలు రైతు అన్నమాట. రవికుమార్ దహియాని రెజ్లర్‌‌గా తయారు చేయడంలో ఆయన తండ్రి రాకేశ్ దహియా చాలానే కష్టపడ్డాడు. రవికుమార్ దహియా రెజ్లింగ్ శిక్షణను పదేళ్ళ వయసు నుండే ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సత్పాల్ సింగ్ వద్ద తీసుకున్నారు. అయితే రెజ్లర్‌‌కి ఆహారంలో అవసరమైన పాలు మరియు పండ్లను కొడుక్కి ఇవ్వడానికి సొంత గ్రామం నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న స్టేడియానికి ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లేవాడు రాకేశ్ దహియా. ఆ తండ్రి ఇచ్చిన ఆ ప్రోత్సాహమే ఇప్పుడు రవికుమార్ దాహియా ఇచ్చిన పతకాలు, ఇవ్వబోయే పతకాలు.

ఇప్పటివరకు రవికుమార్ దహియా రెజ్లింగ్‌లో రెండు బంగారు పతకాలు సాధించాడు. 2020లో ఢిల్లీలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మొదటి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు, ఇక 2021 లో అల్మాటీలో జరిగిన రెజ్లింగ్ పోటీలో రవి రెండవ స్వర్ణం గెలుచుకున్నాడు. ఇది కాకుండా, రవి రెండు రజత పతకాలు మరియు ఒక కాంస్య పతకం సాధించాడు రవికుమార్ దహియా.

Next Story

RELATED STORIES