KOHLI: ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు విరాట్ ఢిల్లీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. తాజాగా కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అందుకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రంజీ మ్యాచ్‌లో సత్తాచాటాలనే లక్ష్యంతో కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, పంత్, జడేజా వంటి స్టార్లు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో 6వ రౌండ్ మ్యాచ్‌లకు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోహ్లీ మాత్రం ఇంకా రీఎంట్రీ ఇవ్వలేదు. ఢిల్లీ తరపున సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడతాడని వార్తలు వచ్చినా.. మెడనొప్పి కారణంగా ఆడలేదు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు విరాట్ ఢిల్లీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. తాజాగా కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్ మార్గదర్శకత్వంలో విరాట్ నెట్ సెషన్‌లో పాల్గొన్నాడు. కోహ్లీ దేశవాళీలో పాల్గొని దాదాపు 13 ఏళ్లు అవుతుంది. చివరిసారిగా 2012లో ఢిల్లీకి ఆడాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అతను ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ అందుకోవాలని.. టీమిండియా భావిస్తోంది.
తీవ్రంగా శ్రమిస్తున్న కోహ్లీ
టీమ్ రాత మార్చేందుకు, అలాగే తన రాత మార్చుకునేందుకు కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకోసమే పాత కోచ్ బంగర్ సాయం తీసుకుంటున్నాడు. అతడి పర్యవేక్షణలో ముంబైలోని ఓ గ్రౌండ్‌లో నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపర్చుకోవడం, ఫుట్‌వర్క్ లోపాలు సరిదిద్దుకోవడం, బంతిపై ఫోకస్ పెంచడం, తిరిగి కాన్ఫిడెన్స్ అందుకోవడం మీద పని చేస్తున్నాడు.
కెప్టెన్సీ నిరాకరించిన కోహ్లీ
IPL 2025 ప్రారంభానికి ముందు సారధ్య బాధ్యతలు చేపట్టేందుకు విరాట్ కోహ్లీ నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఫామ్ లో లేని కోహ్లీ... కెప్టెన్సీ కూడా చేపడితే అనవసర ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ దేశవాళీలో పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు విరాట్ ఢిల్లీ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com