గోపీచంద్ ను కాదని.. అందుకే ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నా : పీవీ సింధు

గోపీచంద్ ను కాదని.. అందుకే ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నా : పీవీ సింధు
పుల్లెల గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ద్రోణాచార్య’ అవార్డు గెలిచిన ఆయన.. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు లాంటి ఎంతోమంది బ్యాడ్మింటన్ స్టార్లను తయారుచేశారు.

పుల్లెల గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ద్రోణాచార్య' అవార్డు గెలిచిన ఆయన.. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు లాంటి ఎంతోమంది బ్యాడ్మింటన్ స్టార్లను తయారుచేశారు. గోపిచంద్ దేశంలోని చాలా మంది షట్లర్లకు శిక్షణ ఇస్తుంటారు. చాలా మందికి ఆయనే స్ఫూర్తి కూడా.. పీవీ సింధు చాలా కాలంగా గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. బ్యాడ్మింటన్‌‌గా ఆమె ఎదగడంలో గోపీచంద్ పాత్ర చాలా కీలకమైనదని చెప్పాలి. అయితే టోక్యో ఒలింపిక్స్ 2020 ముందు గోపిచంద్‌‌‌ని కాదని సింధు.. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టే సేంగ్ తో కలిసి, గోపీచంద్ అకాడమీలో కాకుండా ఇండోర్ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకుంది.

దీనితో గోపీచంద్, సింధు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. దినిపైన సింధు తండ్రి పీవీ రమణ స్పందించారు. " ప్రస్తుతం జాతీయ కోచ్ గా గోపీచంద్ కేవలం సింధు పైన మాత్రమే ద్రుష్టి పెట్టలేరు. దీనికి తోడు ఒలంపిక్స్ లాంటి అంతర్జాతీయ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న సౌకర్యాలు సరిపోవు. అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఇండోర్ స్టేడియం శిక్షణకి బాగుంటుంది. ఇది టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ వేదికతో సమానంగా ఉంటుంది. రెండు వేదికలలో అందుబాటులో ఉన్న సౌకర్యాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి" అని అయన తెలిపారు.

కాగా మార్చి 2019 నుంచి కిమ్ జీ హ్యూన్ దగ్గర శిక్షణ తీసుకుంటుంది సింధు. అతని దగ్గర శిక్షణ తీసుకున్న అదే సంవత్సరంలో BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆమె గెలుచుకుంది, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయురాలిగా ఆమె నిలిచింది. అటు గోపీచంద్ తో తనకెలాంటి విభేదాలు లేవని, కేవలం అవన్నీ పుకార్లు మాత్రమేనని సింధు తాజాగా వెల్లడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌ మహిళల క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. 21 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 56 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింధు నెగ్గింది. దీనితో సెమీ ఫైనల్ కి దూసుకెళ్లింది. కాగా 2016 ఒలింపిక్స్‌ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.

Tags

Read MoreRead Less
Next Story