Hardik Pandya : అత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా, మునాఫ్ పటేల్.. ఆరోపణలు చేసిన గ్యాంగ్‌స్టర్ భార్య ..!

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి భారత్ క్రికెటర్ ల పైన సంచలన ఆరోపణలు చేసింది. హార్ధిక్ పాండ్యా, మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్ కొఠారీ, మాజీ బీసీసీఐ చైర్మన్ రాజీవ్ శుక్లా వీరంతా తనను లైంగికంగా వేధింపులకి గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు చేసింది.
ఈ మేరకు ముంబైలోని సాంతా క్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త రియాజ్ భాటి సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని ప్రముఖల వద్దకు తనని పంపేవాడని ఆమె ఆరోపించింది. ఇక రియాజ్ భార్య రెహ్నుమా, తనకు 15 ఏళ్ల వయసులో అతనితో వివాహమైందని ఫిర్యాదులో పేర్కొంది.
ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రముఖులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని రియాజ్ బలవంతం చేశాడని, అంగీకరించడానికి నిరాకరిస్తే తనను మరియు తన ఇద్దరు పిల్లలను చంపేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది.
అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తులో ఉంది. అయితే ఆమె చేసిన ఆరోపణలకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు అంటున్నారు.
Rehnuma Bhati,wife of Riyaz Bhati(alleged close aide of Dawood Ibrahim) registered complaint at Mumbai's Santacruz PS on Sept 24 alleging rape-molestation by Riyaz Bhati,Munaf Patel,Rajeev Shukla,Hardik Pandya&Prithviraj Kothari. Police verifying allegations,no FIR registered yet
— ANI (@ANI) November 12, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com