Ind-Wi: భారత స్పిన్‌కి విండీస్ విలవిల, యశస్వి అరంగేట్రం

Ind-Wi: భారత స్పిన్‌కి విండీస్ విలవిల, యశస్వి అరంగేట్రం
భారత్--> 80/0 (జైశ్వాల్ 40*, Rohit 30*), విండీస్---> 150 (అతనాజ్ 47, అశ్విన్ 5-60, జడేజా 3-26)

భారత బౌలర్ల ధాటికి విండీస్ మొదటి రోజే బెంభేలెత్తిపోయింది. ఓవర్లో 150 పరుగులకే ఆలౌటయింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో అథనాజ్ ఒక్కడే 47 పరుగులు చేసిన స్కోరే అత్యధికం. భారత స్పిన్నర్ అశ్విన్ 5 వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో 5వికెట్లు తీయడం అశ్విన్‌కి ఇది 33వ సారి. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్లేమి కోల్పోకుండా 80 పరుగులు చేసింది. భారత యువఆటగాడు యశస్వి జైశ్వాల్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ని భారత పేస్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. 9వ ఓవర్లో బౌలింగ్‌కి వచ్చిన అశ్విన్ టర్న్‌ని ఉపయోగించుకూంటూ బౌలింగ్ చేయడంతో తన 3వ ఓవర్లో చందర్‌పాల్(12) వికెట్ దక్కింది. చందర్‌పాల్ తండ్రి శివ్‌నారైన్ చందర్‌పాల్ అప్పటి విండీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. తండ్రీ కొడుకులను ఔట్ చేసిన 5వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌తో స్కోర్ 41/3 కి చేరింది. లంచ్ సమయానికి ఒక బాల్ ముందు సిరాజ్ అద్భుతమైన డైవ్ క్యాచ్ పట్టడంతో బ్లాక్‌వుడ్‌(14)ని పెవిలియన్ బాట పట్టాడు. భారత్ బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, రవీంద్ర జడేజాకి 3 వికెట్లు, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లు చెరో వికెట్ తీశారు.

విండీస్‌ బ్యాట్స్‌మెన్ అదనాజ్ ఒక్కడే భారత బౌలర్లను తట్టుకుని నిలిచాడు. హోల్డర్‌తో కలిసి 6వ వికెట్‌కి 41 పరుగులు జోడించి స్కోర్‌ని 100 దాటించాడు. అయితే అర్ధసెంచరీకి త్రీ పరుగుల దూరంలోనే ఔటవ్వడంతో 150 పరుగులు కూడా కష్టమే అన్పించింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ నిలవకపోవడంతో 150 పరుగులకే ఆలౌటయింది.


చివరి సెషన్లో ఆట ఆరంభించిన భారత్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మలు బరిలోకి దిగారు. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న జైశ్వాలు తన ఖాతా తెరవడానికి 16 బంతులు తీసుకున్నాడు. ఫోర్‌తో తన పరుగుల ఖాతా తెరిచాడు. తర్వాత బౌండరీలు కొడుతూ స్కోర్‌ వేగం పెంచారు.మరో వైపు రోహిత్ శర్మ జైశ్వాల్‌కి పూర్తి మద్దతు అందించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 80 పరుగులు చేసింది భారత్.

Tags

Read MoreRead Less
Next Story