Women's Cricket: మహిళా క్రికెట్ జట్టుకు సాయపడిన మందిరా బేడి: నూతన్ గవాస్కర్..

ఇంగ్లాండ్ పర్యటనకు విమాన టిక్కెట్లు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని సమయంలో, మందిరా బేడి ఆ జట్టును ఆదుకుంది.
2006 వరకు భారత మహిళా క్రికెట్ జట్టు BCCI పరిధిలోకి రాకపోవడంతో, అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్ మరియు ఝులన్ గోస్వామి వంటి ప్రముఖులు ఉన్న జట్టును భారత మహిళా క్రికెట్ సంఘం (WCAI) నిర్వహించేది. కానీ ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. 2003లో ఇంగ్లాండ్‌లో సిరీస్ ఉంది. అక్కడికి వెళ్లేందుకు మొత్తం జట్టుకు టిక్కెట్లు కొనే స్థోమత లేకపోయింది WCAIకి.
అప్పుడే మందిర రంగంలోకి దిగింది. మహిళా ప్రసారకురాలిగా విప్లవం సృష్టించిన మందిర, బ్రాండ్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఒక వజ్రాల ఆభరణాల బ్రాండ్ కోసం ఒక ప్రకటనను చిత్రీకరిస్తున్నప్పుడు, భారత మహిళా జట్టు గురించి, వారి శ్రమతో కూడిన కథ గురించి తెలుసుకుంది. ఆమె బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తన మొత్తం రుసుమును WCAIకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. జట్టుకు నిశ్శబ్ద స్పాన్సర్‌గా మారింది.
WCAI ఆర్థిక ఇబ్బందులు
మందిర వివిధ కంపెనీలతో తనకున్న సంబంధాల ద్వారా WCAI కోసం డబ్బును సేకరించింది. మూడు సంవత్సరాల తరువాత BCCI మరియు దాని రాష్ట్ర సంస్థలు బాధ్యతలు స్వీకరించే వరకు భారత మహిళా క్రికెట్ కు అండగా నిలబడింది.
"భారత మహిళా క్రికెట్ సంఘం (WCAI) 1973లో ఏర్పడింది. 2006 వరకు జాతీయ జట్టును ఎంపిక చేసింది. చివరికి BCCI మహిళల ఆటను తన అధీనంలోకి తీసుకుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి డబ్బు లేని రోజులు, కానీ మహిళలు ఆట పట్ల ఉన్న మక్కువ, ప్రేమతో ఆడారు" అని దిగ్గజ సునీల్ గవాస్కర్ సోదరి మరియు WCAI సీనియర్ సభ్యులలో ఒకరైన నూతన్ గవాస్కర్ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

