Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్.. ఎవరీ నిఖత్ జరీన్

Nikhat Zareen: IBA వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 12వ ఎడిషన్‌లో, భారత బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారత దేశ కీర్తి పతాకాన్ని విను వీధుల్లో ఎగుర వేసింది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన ఐదవ భారతీయ మహిళగా భారతదేశపు అగ్రశ్రేణి మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.
IBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 12వ ఎడిషన్‌లో, టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన 52 కేజీల ఫైనల్లో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను ఓడించి 30-27, 29, 27తో బౌట్‌ను స్కోర్ చేయడం ద్వారా భారత బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 29-28, 30-27, 29-28. ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, మరియు 2018),సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006) లేఖా కెసి (2006) నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా నిలిచారు.
మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత అయిన కజకిస్తాన్‌కు చెందిన జైనా షెకెర్‌బెకోవాను ఓడించి బౌట్‌లోకి వచ్చిన జుటామాస్‌తో నిఖత్ మొదటి మూడు నిమిషాల్లోనే అనేక శక్తివంతమైన పంచ్‌లు తీసి వేగం పెంచింది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్ సెమీ-ఫైనల్‌లో ఆమె ఓడించిన థాయ్ ఫైటర్‌పై తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి 25 ఏళ్ల నిఖత్ జరీన్ తన శక్తి వంచన లేకుండా కృషి చేసింది. 2018లో మేరీకోమ్ సాధించిన విజయం తర్వాత భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం.
ఎవరీ నిఖత్ జరీన్
జూన్ 14, 1996న తెలంగాణలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో జన్మించిన జరీన్ అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో డిగ్రీ చదువుతోంది. ఆమె కెరీర్ ప్రారంభంలో విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత IV రావు వద్ద శిక్షణ పొందేందుకు 2009లో చేరింది. ఆమె 'గోల్డెన్ బెస్ట్ బాక్సర్'గా క్రీడల్లో తన ప్రతిభను చాటుకుంది.
2011లో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల వెయిట్ విభాగంలో గెలుపొందడంతో ఆమె కీర్తిని పొందింది. నిఖత్ విజయనగర్‌లోని ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో అమెరికన్ కోచ్ రాన్ సిమ్స్ వద్ద శిక్షణ పొందింది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం. 2019లో స్ట్రాండ్జా మెమోరియల్‌లో ఆమెకు స్వర్ణం లభించింది. ఆమె 2019 ఇండియా ఓపెన్‌లో కాంస్య పతకాన్ని మరియు స్ట్రాడ్జా మెమోరియల్, 2022లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com