WPL: అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన

WPL: అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన
X
ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో స్టార్‌ ఆటగాళ్లకు భారీ ధర

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లకు భారీ ధర పలికింది. వేలంలో స్టార్ ప్లేయర్ దీప్తి శర్మని ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా WPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే (గుజరాత్‌-రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. దీంతో ఆర్సీబీ ప్లేయర్ స్మృతి మంధాన రూ. 3.4 కోట్లతో లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది.

శ్రీచరణికి రూ.1.3 కోట్లు..

డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణిని ఢిల్లీ జట్టు తీసుకుంది. కనీస ధర రూ.30 లక్షలు కాగా.. ఢిల్లీ, యూపీ పోటీ పడ్డాయి. చివరకు రూ.1.30 కోట్లతో ఢిల్లీ ఫ్రాంఛైజీలోకి వెళ్లింది. మెగ్‌ లానింగ్‌ను రూ.1.90 కోట్లకు యూపీ వారియర్స్‌ తీసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ రూ.1.20 కోట్లతో యూపీ వారియర్స్‌లోకి, లారా వోల్వార్ట్‌ రూ.1.10 కోట్లతో ఢిల్లీ టీంలోకి వెళ్లారు.

దీప్తి శర్మకు రూ.3.20 కోట్లు..

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో మొత్తం 277 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో 194 మంది భారత క్రికెటర్లు కాగా.. 83 మంది విదేశీ ప్లేయర్లు. వేలంలో భాగంగా భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ.3.20 కోట్లకు జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్లు అమేలియా కెర్‌ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు, సోఫీ డివైన్‌ను గుజరాత్‌ రూ.2 కోట్లకు తీసుకున్నాయి.

డేట్ వచ్చేసింది..

హిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL) 2026ను వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5వరకు నిర్వహించనున్నారు. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌, వడోదరలోని బీసీఏ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం క్రీడాకారుల మెగా వేలం కొనసాగుతోంది. దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది.

Tags

Next Story