బ్రిజ్‌భూషణ్ అడుగులకు మడుగులొత్తే వ్యక్తి యోగేశ్వర్ దత్: రెజ్లర్ వినేష్

మహిళా రెజ్లర్ల పేర్లను మీడియా, ఎంపీ బ్రిజ్ భూషణ్‌కి లీక్ చేసింది భాజపా నేత యోగేశ్వర్ దత్ అని స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం ఆరోపణలు చేశారు. మహిళా రెజ్లర్లకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్న అతడిని 2 కమిటీల్లో ఎందుకు ఉంచారని ప్రశ్నించింది. మహిళా రెజ్లర్‌తో అసభ్యంగా మాట్లాడినట్లు కూడా తీవ్రంగా ఆరోపించింది. మహిళా రెజ్లర్ల ఇళ్లకు ఫోన్లు చేసి తమ పిల్లలకు అర్థమయ్యేలా చూసుకోవాంటూ చెప్పాడని ఆరోపిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
ఎంపీ బ్రిజ్ భూషణ్‌కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ రోజు యోగేశ్వర్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ ఆరుగురు రెజ్లర్లలో వినేష్ ఫోగట్ కూడా ఒకరు.
మహిళా రెజ్లర్ల కోసం వేసిన కమిటీల్లోని సభ్యుడిగా ఉన్నపుడు దత్ ఎలా ప్రవర్తించాడో వినేష్ ఫోగట్ ట్విట్టర్‌లో రాసింది.
"రెజ్లర్ల కోసం వేసిన కమిటీల్లో యోగేశ్వర్ దత్ కూడా ఒకరు. తమ కష్టాల్ని కమిటీ ముందు వివరిస్తుంటే అతను వెకిలిగా నవ్వేవాడు. నీళ్లు తాగడానికి బయటకి వచ్చిన తమకు బ్రిజ్ భూషణ్‌కు ఏం కాకూడదన్నాడు. యోగేశ్వర్ వీడియో విన్నపుడు అతని వెకిలి నవ్వు నాకు గుర్తుండిపోయింది" అని ఆవేదన వ్యక్తపరిచింది.
నిరసన ఉద్యమంలో ఇతర రెజ్లర్లు, కోచ్‌లు చేరకుండా అడ్డుకున్నాడని తెలిపింది.
"బ్రిజ్ భూషణ్ అడుగులకు మడుగులు ఒత్తే వ్యక్తిగా నిన్ను ప్రపంచం గుర్తుంచుకుంటుంది. మహిళా రెజ్లర్ల కారణాలు, ఉద్దేశ్యాలు సరియైనవి, సహేతుకమైనవి. మమ్మల్ని మీరు అణగదొక్కలేరు. మీరు సున్నితమనస్కులు కారు. అణచివేతదారులకు మీరు మడుగులొత్తుతున్నంత కాలం వారు ఆనందంగా ఉంటారు" అని తీవ్రంగా ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com