Wrestlers Protest: కేసులో పురోగతి నిల్; మళ్లీ ధర్నా చేపట్టిన రెజ్లర్లు

Wrestlers Protest: కేసులో పురోగతి నిల్; మళ్లీ ధర్నా చేపట్టిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిపై లైంగిక దాడి ఆరోపణలు; బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవడంలో అలసత్వంపై మండిపాడు
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రతిష్ఠ మరింత మసకబారుతోంది. సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ప్రముఖ మహిళా రెజర్లకు మూడు నెలల క్రితం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి సీనియర్ రెజ్లర్ మేరీ కామ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఇప్పటికీ కమిటీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరశిస్తూ రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ, చర్యలు కాదు కదా, కనీసం నివేదికలోనే వివరాలను సైతం బయటకు వెల్లడించలేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ పై ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు వేసినప్పటికీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ ఎందుకు నమోదు చేయలేదని నిలదీస్తున్నారు. కమిటీ సభ్యులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి జంతర్ మంతర్ వద్దకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా అనుమతించడంలేదని వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story