WTC: తొలి రోజే కుప్పకూలిన 14 వికెట్లు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రసవత్తరంగా సాగింది. తొలి రోజే 14 వికెట్లు నేలకూలాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు 212 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సఫారీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో తెంబా బావుమా (3*), డేవిడ్ బెడింగ్హామ్ (8*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 169 పరుగులు వెనుకబడి ఉంది.**
కగిసో రబాడ విజృంభణ
ఫైనల్లో సఫారీలు ఆస్ట్రేలియాను కంగారెత్తించారు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టును 212 పరుగులకే కట్టడి చేశాయి. రబాడ 5 వికెట్లు తీసి చావు దెబ్బతీశాడు. జాన్సెన్ 3, ఎంగిడి, మార్క్రమ్ ఒక్కో వికెట్ సాధించారు. దీంతో కంగారూలు 212 పరుగులకే తోక చుట్టేశారు. ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టెర్(72), స్మిత్(66) మినహా ఎవరు పెద్దగా రాణించలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. కగిసో రబాడ, మార్కో జాన్సెన్ తొలి మూడు ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌లకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. రబాడ, జాన్సెన్ వ్యూహంలో ఖవాజా పూర్తిగా చిక్కుకుపోయాడు. రబాడ వేసిన ఏడో ఓవరల్ మూడో బంతి స్వింగ్ అయ్యి ఖవాజా బ్యాట్ అంచుకు తాకింది. స్లిప్‌లో ఉన్న డేవిడ్ బెడింగ్హామ్ క్యాచ్ అందుకోవడంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. ఖవాజాను డకౌట్ చేసిన తర్వాత రబాడ్ అదే ఓవర్లో గ్రీన్‌ను కూడా ఔట్ చేశాడు. ఓవర్ చివరి బంతి గ్రీన్ బ్యాట్ లోపలి అంచుకు తగిలి మార్క్రమ్ చేతుల్లోకి వెళ్లింది.
గ్రీన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 190/5తో మూడో సెషన్‌ను ఆరంభించిన ఆసీస్.. 22 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. బ్యూ వెబ్‌స్టర్ (72; 92 బంతుల్లో 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. అలెక్స్ కేరీ (23), మార్నస్ లబుషేన్ (17), ట్రావిస్ హెడ్ (11) పరుగులు చేశారు. 20 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా డకౌటయ్యాడు. కామెరూన్ గ్రీన్ (4), పాట్ కమిన్స్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ (5/51) అదరగొట్టాడు. మార్కో యాన్సెన్ 3, కేశవ్ మహరాజ్, మార్క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీలను కంగారులు వణికించారు. ఐడెన్ మార్క్రమ్ డకౌట్ అయ్యాడు. రికెల్టన్ 16, మల్డర్ 6, స్టబ్స్ 2 పరుగులే చేసి పెవిలియన్ చేరారు. క్రీజులో బవుమా, బెడింగమ్ ఉన్నారు. కంగారు బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, హెజిల్ వుడ్ 1, కమిన్స్ 1 వికెట్ తీశారు. రెండో రోజు ఆట కీలకంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com