WTC: చారిత్రక విజయం దిశగా..

WTC: చారిత్రక విజయం దిశగా..
X
విజయం దిశగా దక్షిణాఫ్రికా.. సఫారీల ముందు 282 పరుగుల లక్ష్యం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియా ఉంచిన 282 పరుగుల లక్ష్యం దిశగా సఫారీలు సాగుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 69 పరుగల దూరంలో ఉంది. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఈ దశలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమే. అయితే ఒత్తిడికి చిత్తయ్యే సఫారీలు మరీ ఘోరంగా అడితే తప్ప.. ఈ అద్భుత అవకాశం చేజారడం కష్టమే.

రెండో ఐసీసీ ట్రోఫీ గెలిచే దిశగా..

రెండోసారి ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ఐసీసీ టైటిల్‌ను నెగ్గే అవకాశాన్ని సృష్టించుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 213/2 స్కోరుతో నిలిచింది. ఐదెన్ మార్‌క్రమ్‌ (102*) సెంచరీ సాధించగా.. తెంబా బావుమా (65*) హాఫ్‌ సెంచరీతో క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 69 పరుగులు అవసరం కాగా.. ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అంతకుముందు ర్యాన్ రికిల్‌టన్ (6), వ్యాన్ ముల్దర్ (27) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్‌లో 212 పరుగులు చేసి ఆలౌట్ అయిన ఆసిస్, రెండో ఇన్సింగ్స్‌లో 207 పరుగులు చేసింది. ఆసిస్ బ్యాటర్లలో లబుషేన్ (22), క్యారీ(43), స్టార్క్(58)తో రాణించగా మిగిలిన బ్యాటర్లంతా విఫలం అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా నాలుగు వికెట్లు, లుంగి ఎంగిడి మూడు వికెట్లు, జాన్సన్, వల్డర్, మార్కరమ్ తలో వికెట్ తీశారు.

స్టార్ బ్యాటర్ మార్కరమ్ సెంచరీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ మార్కరమ్ అదరగొట్టారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో జట్టును ఆదుకోవడమే గాకుండా సెంచరీతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో 156 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 102 పరుగులు చేశారు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు సఫారీ జట్టు కెప్టెన్ టెంబ బవూమా కూడా రాణించారు. 117 బంతులు ఎదుర్కొన్న బవూమా 65 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 213 పరుగులు చేసింది. విశ్వవిజేతగా నిలవాలంటే మరో 69 పరుగులు చేయాల్సి ఉంది. **ఆస్ట్రేలియా టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ చరిత్ర సృష్టించారు. ఐసీసీ ఫైనల్స్‌ చరిత్రలోనే 10వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌‌లో ఈ ఫీట్ సాధించారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా మిచెల్ స్టార్క్(136 బంతుల్లో 5 ఫోర్లతో 58), జోష్ హజెల్‌వుడ్(53 బంతుల్లో 2 ఫోర్లతో 17)లు 10వ వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ 50 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశారు. లార్డ్స్‌లోని ప్రతిష్టాత్మక క్రికెట్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు మానవత్వాన్ని చాటుకున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు రెండు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆట ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపారు.

Tags

Next Story