WWC: భారీ స్కోరు చేసినా ఆసీస్‌దే గెలుపు

విశాఖ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆసీస్ మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ ధాటికి మిడిలార్డర్ తోడవ్వడంతో భారత్ ఏకంగా 330 పరుగులతో వహ్వా.. అనిపించింది. ఇక గెలుపు మనదే అని ఫ్యాన్స్ సంబరపడిన వేళ ప్రత్యర్థి ఆసీస్ మాత్రం ఎప్పటిలాగే తమ ప్రొఫెషనల్ ఆటతీరును చూపింది. లక్ష్యం ఎంత భారీదైనా తమ దూకుడు ముందు దిగదుడుపే అని నిరూపించింది. కెప్టెన్ అలీసా హీలీ ఆరంభం నుంచే కదం తొక్కుతూ అద్భుత శతకంతో ఛేదనకు మార్గం సుగమం చేసిన వేళ.. భారత బౌలర్ల పోరాటం చిన్నబోయింది.
మంధాన, రావల్ మెరుపులు
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌కు.. అదిరే ఆరంభాన్నిచ్చారు స్మృతి మంధాన, ప్రతీక రావల్. తొలి మూడు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఈ జోడీ.. కీలక పోరులో, బలమైన ఆస్ట్రేలియాపై గొప్పగా బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై స్మృతి, ప్రతీక జోడీని అడ్డుకోవడం ఆసీస్ బౌలర్లకు సాధ్యం కాలేదు. స్మృతి.. మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.స్పిన్నర్ మోలనూ వేసిన 8వ ఓవర్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లతో స్మృతి రెచ్చిపోయింది. ఆమె 46 బంతుల్లోనే అర్ధశతకాన్నందుకుంది. ప్రతీక 69 బంతుల్లో ఈ మార్కును చేరుకుంది. 24 ఓవర్లకు 153/0తో భారత్ తిరుగులేని స్థితికి చేరుకుంది. మొదట భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్మృతి మంధాన (80; 66 బంతుల్లో 9×4, 3×6), ప్రతీక రావల్ (75; 96 బంతుల్లో 10×4, 1×6) మెరిశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ (5/40) అదరగొట్టింది. సోఫీ మోలనూ 3 వికెట్లు తీసింది.
హీలీ దంచేసింది
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) అద్భుత శతకానికి.. ఎలీస్ పెర్రీ (47 నాటౌట్; 52 బంతుల్లో 5×4, 1×6), ఆష్లీ గార్డ్నర్ (45; 46 బంతుల్లో 3×4, 1×6), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (40; 39 బంతుల్లో 6×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్‌లు తోడవడంతో ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 137 బంతుల్లో 161 పరుగులతో సమీకరణం కష్టంగా కనిపించింది. కానీ అలీసా మాత్రం పట్టు వదల్లేదు. 84 బంతుల్లోనే సెంచరీ చేసిన ఆమె.. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించింది. మహిళల వన్డేల్లో ఇదే అతిపెద్ద ఛేదన. తెలుగమ్మాయి శ్రీ చరణి (3/41) గొప్పగా బౌలింగ్ చేసింది. దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన పెర్రీ, కిమ్ గార్త్ (14 నాటౌట్) కలిసి ఆసీస్‌ను గెలిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com