WWC: ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరు

మహిళల ప్రపంచకప్‌లో కీలక పోరుకు భారత్ సిద్ధమైంది. బలమైన ఇంగ్లాండ్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియాకు.. ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. మహిళల ప్రపంచ కప్ 2025లో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. వరల్డ్ కప్ టోర్నమెంట్లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల చేతిలో వరుసగా ఓటమిపాలైన తర్వాత, టీమిండియా సెమీఫైనల్ రేసులో కష్టాల్లో పడింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం 4లో ఉన్నప్పటికీ కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉండటం వల్ల ఈ స్థానం సురక్షితం కాదు. ముఖ్యంగా రాబోయే మ్యాచ్‌లు బలమైన జట్లతో ఉండటంతో భారత సెమీస్ చేరడం సవాలుగా మారింది.
ఏకైక మార్గం ఇదే
భారత్ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని తప్పకుండా గెలవాలి. ఈ మ్యాచ్ తర్వాత అక్టోబర్ 23, 2025న న్యూజిలాండ్‌తో కూడా తలపడాలి.ఈ రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు చాలా కీలకం. ఈ రెండింటిలోనూ ఓడిపోతే భారత్ ప్రపంచ కప్ కలలు అక్కడితోనే ముగిసిపోవచ్చు. అందుకే, టీమిండియా ఈ రెండు బలమైన జట్లలో కనీసం ఒకదానినైనా ఓడించడం చాలా ముఖ్యం. న్యూజిలాండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి న్యూజిలాండ్‌ను ఓడించడం వల్ల భారత్‌కు రెండు ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com