WWC2025: ప్రపంచ రికార్డు సృష్టించి ఫైనల్‌కు..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. సెమీఫైనల్లో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి.. ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకానికి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఫైనల్లో ఏ జట్టు గెలిచినా అది తొలి జట్టుగా నిలవనుంది. నవీ ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ అసాధారణ ప్రదర్శన చేసిన భారత్.. మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించి ఫైనల్ చేరింది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అత్యధిక పరుగుల వేట. జెమిమా రోడ్రిగ్జ్ అజేయంగా 127 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో భారత్ 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
కంగారులు దంచేశారు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించింది. లీచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం (133 బంతుల్లో) నెలకొల్పారు. ఆష్లీన్ గార్డ్నర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్, రాధాతలో వికెట్ పడగొట్టారు.
జెమీమా కొత్త చరిత్ర
339 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ (127*; 134 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీతో మెరిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. జెమీమా, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం (156 బంతుల్లో) నెలకొల్పారు. దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), స్మృతి మంధాన (24), అమన్‌జ్యోత్ (15*), షెఫాలీ (10) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు. టీమ్ఇండియా ఫైనల్ చేరడం ఇది మూడోసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

