WWC2025: భారత్ బలమేంటీ..? దక్షిణాఫ్రికా బలహీనతేంటీ..?

2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు నేడు తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ప్రదర్శించిన ఆటతీరు, సమష్టి కృషి ఆధారంగా ఈ పోరు ఉత్కంఠభరితంగా ఉండనుంది.
భారత జట్టు బలాలు:
స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్ లాంటి స్పిన్నర్లు భారత పిచ్‌లలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ నిలబెట్టే శక్తి జట్టుకి ఉంది. ఫీల్డింగ్ విభాగం కూడా గత సిరీస్‌లతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తోంది.
బలహీనతలు:
ఫాస్ట్ బౌలింగ్‌లో అనుభవం కొద్దిగా తక్కువ. కొత్త బంతితో బ్రేక్‌థ్రూ ఇవ్వడం లోపిస్తోంది. ఒత్తిడిలో, ముఖ్యంగా ఫైనల్ వేదికపై, జట్టు స్థిరంగా నిలబడాలనే సవాలు ఉంది.
దక్షిణాఫ్రికా జట్టు బలాలు:
లౌరా వోల్వార్డ్ట్, టాజ్మిన్ బ్రిట్స్ లాంటి ఓపెనర్లు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశారు. మారిజాన్నే కాప్, సునే లూస్ లాంటి ఆల్‌రౌండర్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతుల్యత తీసుకువస్తున్నారు.
బలహీనతలు:
భారత పిచ్‌లలో స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది. ఒత్తిడిలో తేలికగా వికెట్లు కోల్పోయే స్వభావం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

