JAISWAL: ముంబైను వీడిన యశస్వీ జైస్వాల్

టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. దేశవాళీ క్రికెట్ కు సంబంధించి ముంబైకి జైస్వాల్ వీడ్కోలు పలికారు. 2025-26 నుంచి గోవాకు ఆడనున్నట్లు ముంబై క్రికెట్ అసోషియేషన్ కు తెలిపాడు. నో అబ్జెక్షన్ పత్రం కోసం ముంబై క్రికెట్ బోర్డుకు జైస్వాల్ లేఖ రాశారు. ముంబై టీమ్ లో అవకాశలు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నుంచి తిరిగి వచ్చిన తర్వాత జైస్వాల్ దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున రంజీలో ఆడాడు. టీమిండియా ప్లేయర్లు కచ్చితంగా దేశవాళీ టోర్నీల్లో ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రంజీ ట్రోఫీలో జైస్వాల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com