YOGRAJ SINGH: యువరాజ్‌కు వెన్నుపోటు పొడిచారు

డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్‌కు తగినంత గుర్తింపు రాకపోవడానికి ధోనీనే కారణమని యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ తరచుగా ఆరోపిస్తుంటారు. తాజాగా ధోనీతో పాటు విరాట్ కోహ్లీపై కూడా యోగ్రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. 'ఒకరు ఎదుగుతుంటే వెన్నుపోటు పొడిచే వారు ఎందరో ఉంటారు. యువరాజ్ సింగ్ అంటే చాలా మంది భయపడ్డారు. తమ స్థానం ఎక్కడ లాగేసుకుంటాడో అని వారికి భయం. యువరాజ్ చాలా గొప్ప క్రికెటర్. అందుకే అతడిని చూసి స్వంత జట్టులోని వారే భయపడి వెన్నుపోటు పొడిచారు. ధోనీతో సహా చాలా మందికి యువీ అంటే భయం' అని యోగ్రాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'ఇక్కడ నిజమైన స్నేహాలు ఉండవు. డబ్బు, విజయం, పేరు ప్రఖ్యాతలకే విలువ ఎక్కువ. కెరీర్ ఆరంభంలో యువీ అంటే ఎంతో ఇష్టపడిన కోహ్లీ ఆ తర్వాత మారిపోయాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు యువీకి పెద్దగా అవకాశాలు కల్పించలేదు. కోహ్లీ సపోర్ట్ చేసి ఉంటే యువీ మరింత కాలం ఆడేవాడు' అని యోగ్రాజ్ పేర్కొన్నారు.
అయితే గతంలోనే యువరాజ్ తన తండ్రి వ్యాఖ్యలను ఖండించాడు. ధోనీ, కోహ్లీ తనకు ఎంత సహాయం చేయాలో అంతా చేశారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. యూవీ 6 బంతులకు ఆరు సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించాడు.
కేరళ క్రికెట్ లీగ్‌లో బ్యాటర్ టైమ్డ్ అవుట్
కేరళ క్రికెట్ లీగ్-2025లో అసాధారణ ఘటన జరిగింది. ఈ ఫార్మాట్ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. కాలికట్ గ్లోబ్స్టార్స్తో జరిగిన మ్యాచ్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ ఆటగాడు అల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు ఔటయ్యాక 90 సెకెన్లలోపు మరో ఆటగాడు క్రీజ్‌లోకి రావాల్సి ఉంటుంది. అయితే అల్ఫీ నిర్దేశిత సమయాన్ని దాటాక క్రీజ్‌లోకి వచ్చాడు. ఇది గమనించిన కాలికట్ బౌలర్లు ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. పలు మార్లు పరిశీలించిన అనంతరం అంపైర్ అల్ఫీని ఔట్‌గా ప్రకటించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com