YUVI: ఐపీఎల్‌లోకి యువరాజ్ రీఎంట్రీ

ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు తమ కోచింగ్ స్టాప్‌లో పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దమైంది. మొన్న మెంటార్ జహీర్ ఖాన్‌పై వేటు వేసిన లక్నో.. ఇప్పుడు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ను తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఆండీ ఫ్లవర్ తర్వాత లక్నో ప్రధాన కోచ్‌గా వచ్చిన లాంగర్.. టీమిండియా ప్లే్యర్స్ తో సరైన సంబంధాలను కొనసాగించలేకపోయారని తెలుస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ను తమ హెడ్ కోచ్‌గా తెచ్చుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తున్నట్లు టాక్. అయితే, లక్నో ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ తమ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను నియమించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. యువరాజ్ సింగ్‌తో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, యువీ మాత్రం ఇప్పటి వరకు ఏ ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేయకవడంతో పాటు.. అబుదాబి టి10 లీగ్‌లో మాత్రం మెంటార్‌గా కొనసాగుతున్నాడు. పంజాబ్‌కు చెందిన ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కు మాత్రం తన అనుభవంతో తీర్చిదిద్దాడు. అభిషేక్ శర్మ, ప్రియాన్ష్ ఆర్య లాంటి ఆటగాళ్లు యువరాజ్ శిష్యులే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

