Yuvraj Singh : యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ ..!

Yuvraj Singh : యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ ..!
Yuvraj Singh : టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. గ‌త ఏడాది కుల వివ‌క్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేసులో హ‌ర్యానాలోని హిసార్ జిల్లా హ‌న్సి పోలీసులు యువ‌రాజ్‌ను అరెస్టు చేశారు.

టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. గ‌త ఏడాది కుల వివ‌క్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేసులో హ‌ర్యానాలోని హిసార్ జిల్లా హ‌న్సి పోలీసులు యువ‌రాజ్‌ను అరెస్టు చేశారు. అయితే వెంట‌నే బెయిల్ రావ‌డంతో యూవీ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

గ‌త ఏడాది రోహిత్ శ‌ర్మతో క‌లిసి యువ‌రాజ్ సింగ్ ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లో మాట్లాడారు. ఆ సంద‌ర్భంగా యుజేంద్ర చాహ‌ల్‌పై యూవీ వివాదాస్పద కామెంట్లు చేశారు. చాహ‌ల్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీడియోలు చేస్తున్నారని.. బాంగీ మ‌నుషుల్లా వీళ్ల‌కు ప‌ని పాటా లేదా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి రోహిత్ శ‌ర్మ, యూవీ ఇద్దరూ న‌వ్వుకున్నారు. ఆ వీడియో అప్పట్లో తెగ వైర‌ల్ కాగా.... ద‌ళితుల‌ను అవ‌మానించేలా యువ‌రాజ్ మాట‌లు ఉన్నాయ‌ని నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శలు వ‌చ్చాయి.

యువ‌రాజ్ సింగ్ క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్లు కూడా వ‌చ్చాయి. ఈ క్రమంలోనే హ‌ర్యానాలోని హిస్సార్ పోలీస్ స్టేష‌న్‌లో యువ‌రాజ్ సింగ్‌పై కేసు న‌మోదైంది. హ‌ర్యానా ద‌ళిత హ‌క్కుల నేత ర‌జ‌త్ క‌ల్సన్ ఫిర్యాదు మేర‌కు ఈ కేసు న‌మోదైంది. ఈ క్రమంలో త‌న వ్యాఖ్యల‌పై అప్పట్లోనే యువ‌రాజ్ క్షమాప‌ణ‌లు కూడా చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story