Sports News: రిషబ్‌ను కలిసిన యువీ..

Sports News: స్టార్ ఇండియన్ వికెట్ కీపర్ రషబ్ పంత్ భయంకరమైన కారు ప్రమాదానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రిషబ్ పంత్‌ను కలిశాడు. పంత్ త్వరలో ఫీల్డ్‌లోకి వస్తాడని అభిమానులకు వాగ్దానం చేశాడు. అలాగే తన 'పాజిటివ్' యాటిట్యూడ్ అందరితో సరదాగా ఉండడం అతడి ప్లస్ పాయింట్లుగా చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌కు పంత్ దూరం కానున్నాడు. దిగ్గజ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. రిషబ్‌ని కలిసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశంలోని ఇద్దరు ప్రతిభావంతులైన క్రికెటర్లను ఒకే ఫ్రేమ్‌లో చూడడం అభిమానులకు ఆనందాన్నిస్తోంది.
డిసెంబరు 30న ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే వద్ద రూర్కే సమీపంలో పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. స్టార్ ఇండియన్ వికెట్ కీపర్ తన తల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు బయల్దేరాడు. ఆమెతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వెళుతుండగా, అతని కారు డివైడర్‌ను ఢీకొట్టి, పలుమార్లు పల్టీలు కొట్టడంతో మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగకముందే, పంత్ కొద్దిమంది స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్రమాదం కారణంగా పంత్‌కు అనేక గాయాలయ్యాయి. మోకాలికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. రూర్కీలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం ముంబై తరలించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో అతడికి సర్జరీ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్‌కు అతని రాకపై సందేహాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com