Ashes Test: క్రాలే విధ్వంసం.. పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

ఆ్రస్టేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్(Ashes Test) నాలుగో టెస్టులో ఇంగ్లండ్( England) రెండో రోజు అదరగొట్టింది. బజ్‌బాల్ ఆటతో ఎడాపెడా బాదేసి కంగారులకు చుక్కలు చూపించింది. ఆసిస్(Australia) బౌలర్లను ఊచకోత కోసిన ఓపెనర్ జాక్ క్రాలేZak Crawley) ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
వన్డే తరహాలో విధ్వంసం సృష్టించిన క్రాలే త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇంగ్లిష్ ఆటగాళ్లు వన్డే తరహా దూకుడు కనబర్చడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది.
నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ 67 పరుగుల ఆధిక్యం సాధించింది. వన్డే తరహాలో దూకుడుగా ఆడిన ఓపెనర్ జాక్ క్రాలే 182 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 189 పరుగులు సాధించి త్రుటిలో ద్వి శతకాన్ని చేజార్చుకొన్నాడు. క్రాలే ఆటతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ రెండో రోజు గురువారం ఆటముగిసే సమయానికి 4 వికెట్లకు 384 పరుగులు చేసింది. బ్రూక్ 14, బెన్ స్టోక్స్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొయిన్ అలీ(Moeen Ali) 54 పరుగులు, రూట్(Joe Root) 84 పరుగులతో రాణించారు. మొయిన్ అలీతో కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన క్రాలే.. రూట్‌తో కలసి మూడో వికెట్‌కు 206 రన్స్ జోడించాడు. మరో ఓపెనర్ డకెట్ ఒక్క పరుగుకే వెనుదిరిగినా క్రాలే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న క్రాలేను గ్రీన్ బౌల్డ్ చేయగా.. రూట్‌ను హాజెల్‌వుడ్ పెవిలియన్ చేర్చాడు.
వర్షం వడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వీలైనంత వేగంగా మ్యాచ్‌ను ముగించి సిరీ్‌సను సమం చేయాలనేది ఇంగ్లండ్ భావిస్తోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 299/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 18 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 299/8 వద్ద కమిన్స్ (1)ను అండర్సన్ క్యాచవుట్ చేయగా.. హాజెల్‌వుడ్ (4)ను వోక్స్ అవుట్ చేశాడు. మిచెల్ స్టార్క్ (36 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లు... బ్రాడ్ 2 వికెట్లు తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com