Lunar Eclipse 2023: రేపు చంద్రగ్రహణం..!

Lunar Eclipse 2023: రేపు చంద్రగ్రహణం..!

మే5, 2023న చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం భారత్ తోపాటు ప్రపంచంలోని చాలా దేశాలలో కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భారత దేశంలో చంద్రగ్రహణం దాదాపు 4గంటల 17 నిమిషాల 31 సెకన్లు సంభవించనున్నట్లు తెలిపారు. 2023 రాత్రి 08:44 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 10.52 కు ముగుస్తుంది. చంద్రుడు రాత్రి 10:52 గంటలకు గ్రహణం యొక్క గరిష్ట దశకు చేరుకుంటాడు. చంద్రగ్రహణం భారత్ తో పాటు ఆఫ్రికాలోని తూర్పు భాగంలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఆసియాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.

ప్రపంచంలోని ఈ నగరాలు పెనుంబ్రల్ గ్రహణాన్ని చూస్తాయి: జోహన్నెస్‌బర్గ్, తాష్కెంట్, బ్యాంకాక్, సియోల్, కైరో, మనీలా, ఫిలిప్పీన్స్, జకార్తా, సింగపూర్, అంకారా, ఢాకా, యాంగాన్, హనోయి, మెల్‌బోర్న్, బాగ్దాద్, మాస్కో, తైపీ, టోక్యో, బీజింగ్, బీజింగ్ లలో కూడా కనిపించనుంది. చంద్రగ్రహణం ప్రారంభం నుంచి చివరి వరకు అన్ని దశలను భారతదేశం మొత్తం చూడవచ్చని ఎంపీ బిర్లా ప్లానిటోరియం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 28న పాక్షిక గ్రహణం ఏర్పడుతుందని ప్లానిటోరియం సైంటిఫిక్ ఆఫీసర్ శిల్పి గుప్తా IndiiaToday.inకి తెలిపారు. తదుపరి పెనుంబ్రల్ చంద్రగ్రహణం మార్చి 25, 2024న జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story