కృత్రిమ పాలు.. కృత్రిమ మాంసం.. టెక్నాలజీ మహిమ..

కృత్రిమ పాలు.. కృత్రిమ మాంసం.. టెక్నాలజీ మహిమ..
Artificial Blood and MilK: మనిషి మేధా శక్తికి మరింత పదును పెట్టి కృత్రిమ వస్తువులను ఎన్నింటినో సృష్టిస్తున్నాడు.

మనిషి మేధా శక్తికి మరింత పదును పెట్టి కృత్రిమ వస్తువులను ఎన్నింటినో సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఆ వరుసలోకి పాలు కూడా వచ్చి చేరాయి. పాల కోసం ఆవులు, గేదెలు పెంచాలా వాటిని శుభ్రంగా మేపాలా.. అవి వేసిన పేడ, చెత్తా చెదారం ఎత్తాలా.. పాలు బాగా ఇవ్వడం కోసం వాటికి బలవర్ధకమైన ఆహానం పెట్టాలా. ఆనక పాలు పిండి ప్యాకెట్లలో నింపాలా.. అబ్బో శానా తతంగమే ఉంది.

జంతువులతో ఏ మాత్రం సంబంధం లేకుండా పాలను పోలిన పాలను తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకు. అంతే.. కొన్ని రకాల శిలీంద్రాలను ఉపయోగించి పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. పెర్‌ఫెక్ట్ డెయిరీ, ఇమాజిన్ డెయిరీ వంటి సంస్థలు ఇలాంటి కృత్రిమ పాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది.

మాంసం కావాలంటే కూడా అంతే.. ఎన్నో జంతువుల్ని పెంచాలి.. వాటిని పోషించాలి. భూమ్మీద ఉన్న సగం నేల వీటి కోసమే వినియోగించాల్సొస్తుంది. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ పెట్టి.. అందులో పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావలసినంత మాంసం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్లకిందటే ఈ ఐడియా వచ్చి ప్రయత్నాలు ప్రారంభించినా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో పరిశోధన ముందుకు సాగలేదు.

2018లో ఇజ్రాయిల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ మాంసపు ముక్కని ల్యాబ్‌లో సృష్టించింది. అయితే దీని ధర భారీగా ఉంది. అందుకే మరిన్ని పరిశోధనలు జరిపి అందరికీ అందుబాటులో మటన్ ముక్కలను తీసుకురావలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇజ్రాయిల్‌లోనే మరో కంపెనీ చికెన్ ముక్కలను కృత్రిమంగా తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. మరి ఇండియా మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో.

ఆఖరికి బ్లెడ్ కూడా బ్రెడ్‌లా మార్కెట్లో రెడీమేడ్‌గా..

నీ బాడీలో బ్లెడ్ అస్సల్లేదు. ఏం తిండి తినట్లేదా.. రక్తం ఎక్కించమంటావా.. బ్లెడ్ ఎక్కించుకోవాలంటే బోల్డంత పని. బోల్డన్ని డౌట్లు. ఇకపై ఆ డౌట్లేమీ అక్కర్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కార్య రూపం దాల్చలేదు. ఈ మధ్య కృత్రిమ రక్తం పరిశోధనల్లో పురోగతి కనిపించింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తే త్వరలో కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story