AI ERA: నైపుణ్యాలకే పట్టం.. సర్టిఫికేట్ల కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యం

AI ERA: నైపుణ్యాలకే పట్టం.. సర్టిఫికేట్ల కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యం
X
ఏఐ ఉద్యోగాల్లో 25.4% వాటాతో బెంగళూరు టాప్... దిల్లీ-ఎన్‌సీఆర్‌ 24.8%, ముంబయి 19.2% వాటా... హైదరాబాద్‌ 12.5%, పుణె 9.6% వాటాలు

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఉద్యోగాల విపణిలో దేశీయ మెట్రో నగరాలు దూసుకెళ్తున్నాయి. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ సీబీఆర్‌ఈ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌లో నమోదైన ఏఐ ఉద్యోగాల్లో దాదాపు 70 శాతం బెంగళూరు, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయిల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. 2025 డిసెంబరు నాటికి నౌకరీలో ఉన్న 64,500 క్రియాశీల ఏఐ ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. అయితే, ఈ డేటా మొత్తం దేశంలోని ఏఐ ఉద్యోగ మార్కెట్‌ను పూర్తిగా ప్రతిబింబించదని సీబీఆర్‌ఈ స్పష్టం చేసింది. మొత్తం ఏఐ అనుబంధ ఉద్యోగాల్లో బెంగళూరు 25.4 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) అధికంగా ఉండటం ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌ 24.8 శాతం, ముంబయి 19.2 శాతం వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ 12.5 శాతం, పుణె 9.6 శాతం, చెన్నై 6.4 శాతం, కోల్‌కతా 2.1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

అంతా ఏఐ మయం

ప్రస్తుతం ఏఐ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, డేటా సైన్స్‌, అనలిటిక్స్‌, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌, ఆటోమేషన్ రంగాల్లో నియామకాలు వేగంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, ఈ-కామర్స్‌, తయారీ వంటి రంగాలు కూడా ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి సారించడంతో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరిగింది. “ఏఐ అనేది ఇప్పుడు కేవలం చర్చాంశం కాదు; భారత ఆర్థిక వృద్ధిలో కీలక భాగంగా మారింది. అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని సేవా కేంద్రంగానే కాకుండా, ఆవిష్కరణల హబ్‌గా చూస్తున్నాయి” అని సీబీఆర్‌ఈ ఇండియా ఛైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఫ్రెషర్ల నియామకాల విషయంలో కూడా ఉత్సాహకర పరిస్థితి కనిపిస్తోంది. టీమ్ ఈజ్ ఎడ్ టెక్ విడుదల చేసిన ‘కెరీర్ ఔట్‌లుక్’ నివేదిక ప్రకారం, 2026 ప్రథమార్థంలో 73 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1051 కంపెనీల సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ చేపట్టారు. గత ఆరు నెలలతో పోలిస్తే ఇది 3 శాతం అధికం కావడం గమనార్హం. కం­పె­నీ­లు కే­వ­లం అకా­డ­మి­క్ సర్టి­ఫి­కే­ట్ల­కే పరి­మి­తం కా­కుం­డా, ఇం­ట­ర్న్‌­షి­ప్‌­లు, ప్రా­జె­క్టు అను­భ­వం, ప్రా­క్టి­క­ల్ నై­పు­ణ్యా­ల­ను ప్రా­ధా­న్యం­గా చూ­స్తు­న్నా­య­ని ని­వే­దిక వె­ల్ల­డిం­చిం­ది. రి­టె­యి­ల్‌ (91%), ఈ-కా­మ­ర్స్‌, టె­క్నా­ల­జీ స్టా­ర్ట­ప్‌­లు (90%), తయా­రీ (85%), పర్యా­ట­కం, ఆతి­థ్యం (77%) రం­గా­ల్లో ఫ్రె­ష­ర్ల­కు అధిక అవ­కా­శా­లు ఉన్నా­యి. బెం­గ­ళూ­రు 84 శాతం ని­యా­మ­కా­ల­తో అగ్ర­స్థా­నం­లో ఉం­డ­గా, ముం­బ­యి 72 శా­తం­తో రెం­డో స్థా­నం­లో ఉంది. అప్రెం­టి­స్‌­షి­ప్‌ల ప్రా­ధా­న్యం కూడా పె­రు­గు­తోం­ది. ము­ఖ్యం­గా బెం­గ­ళూ­రు­లో 45 శాతం కం­పె­నీ­లు డి­గ్రీ అప్రెం­టి­స్‌­షి­ప్ అభ్య­ర్థు­ల­పై ఆస­క్తి చూ­పు­తు­న్నా­యి. వి­ద్యు­త్‌, ఇంధన రం­గా­ల్లో గి­రా­కీ 50 శాతం పె­ర­గ­డం ప్ర­త్యే­కం­గా కని­పి­స్తోం­ది. నై­పు­ణ్యా­లే వి­జ­యా­ని­కి కీ­ల­క­మ­నే సం­దే­శం ఈ ని­వే­ది­క­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­యి. వి­శ్లే­ష­కుల అభి­ప్రా­యం ప్ర­కా­రం, రా­బో­యే రెం­డే­ళ్ల­లో జన­రే­టి­వ్‌ ఏఐ, మె­షి­న్‌ లె­ర్నిం­గ్‌, రో­బో­టి­క్ ప్రా­సె­స్ ఆటో­మే­ష­న్‌ వంటి రం­గా­ల్లో మరింత వి­స్త­రణ కని­పిం­చే అవ­కా­శం ఉంది. స్టా­ర్ట­ప్‌­లు మా­త్ర­మే కా­కుం­డా సం­ప్ర­దాయ పరి­శ్ర­మ­లూ డి­జి­ట­ల్‌ మా­ర్పు ది­శ­గా అడు­గు­లు వే­స్తుం­డ­టం­తో మధ్య­స్థా­యి మరి­యు ప్ర­వేశ స్థా­యి ఉద్యో­గాల సం­ఖ్య కూడా పె­రి­గే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి.

Tags

Next Story