ఒక రౌటర్ తో 60 డివైస్ లు కనెక్ట్ చేస్కోవచ్చు.. ఎయిర్ టెల్ కొత్త ఆఫర్.

ఒక రౌటర్ తో 60 డివైస్ లు కనెక్ట్ చేస్కోవచ్చు.. ఎయిర్ టెల్ కొత్త ఆఫర్.
Wi-Fi Router : బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో ఎయిర్‌టెల్ ఇండస్ట్రీ-ఫస్ట్ రౌటర్‌ని విడుదల చేసింది.

కరోనా మహమ్మారి మన జీవితాలను చాలా విధాలుగా మార్చింది. ప్రస్తుతం మనలో చాలామంది ఇంటి వద్ద నుండే పని చేస్తున్నవారు ఉన్నారు. రెండు సంవతరాల ముందు వారకి ఎవరు ఊహించని పరిణామం ఇది. అయినా మనం దీనిని తొందరగానే అలవాటు చేస్కున్నాం, ఇలా ఇంటి వద్దనుండి పని చేయడం వల్ల ఎలాంటి సమస్యలు లేవు. కానీ.. ఇంటిలోని ప్రతి ఒక్కళ్ళు పని, విద్య లేదా వినోదం కోసం ఇంటర్నెట్ పైన ఆదారపడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నా.. రెండు, మూడు డివైజ్ లు కనెక్ట్ అయ్యేస్సరికి నెట్ స్పీడ్ పుర్తుగా తగ్గిపోయి మధ్యలోనే డిస్కనెక్ట్ అవుతుంది.

అయితే ఈ సమస్యని అధిగమించడానికి 1Gbps బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో ఎయిర్‌టెల్ ఇండస్ట్రీ-ఫస్ట్ రౌటర్‌ని విడుదల చేసింది. ఈ రౌటర్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తి 1Gbps బ్యాండ్‌విడ్త్‌ని వైర్‌లెస్‌గా అందించగలదు, ఇంకా ఈ రౌటర్‌ సహాయంతో ఒకేసారి 60 డివైస్ లని కనెక్ట్ చేస్కోవచ్చు. ఇటివల ఎయిర్‌టెల్ సంస్థ ఈ రౌటర్‌ పై పరిక్షలు నిర్వహించగా ఒకేసారి 60 డివైస్ లకి స్థిరమైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించగలిగింది.

దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.. ఇది డ్యూయల్-బ్యాండ్ రౌటర్, అంటే 2.4 GHz మరియు 5 GHz రెండు ఫ్రీక్వెన్సీలకు సపోర్ట్ చేస్తుంది. ఇది నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను తగ్గించి.. పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల యూసర్ తను చేస్తున్న పనినిబట్టి నెట్వర్క్ స్పీడ్ ని మార్చుకునే అవకాశం ఉంటుంది. శక్తివంతమైన దీని యాంటెనాలు విస్తృత కవరేజీని అందించి.. మీ కంప్యూటర్‌, మొబైల్ వంటి పరికరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్నెట్‌ని అందిస్తుంది. వేగవంతమైన డౌన్‌లోడ్‌లు మరియు క్లియర్ స్ట్రీమింగ్ అందిచే వీలు కల్పిస్తుంది ఈ రౌటర్‌.

ఈ రౌటర్‌ తో ఇంటర్నెట్ ఉపయోగం అనేది వేగవంతమే కాదు మరింత సురక్షితమైనది కూడా అని ఎయిర్ టెల్ సంస్థ పేర్కొంది. సైబర్ ఫిషింగ్, వైరస్ మరియు హాకింగ్ వంటి అనుమానాస్పద కార్యకలాపాలకి అడ్డుకట్ట వేసి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు సురక్షిత ఇంటర్నెట్‌ను అందించనుంది.



Tags

Read MoreRead Less
Next Story