AI-Jobs: AI తో ఉద్యోగాలకు ఎసరే..: ఛాట్‌జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మాన్

AI-Jobs: AI తో ఉద్యోగాలకు ఎసరే..: ఛాట్‌జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మాన్
AI టూల్‌ గుడ్డిగా నమ్మదగినది కాదని, దాని పరిమితులు దానికి ఉంటాయన్నాడు.

Artificial Intelligence: దూసుకెళ్తున్న ఏఐ(AI) రంగంతో కష్టాలు తప్పవని ఛాట్ జీపీటీ(ChatGPT) సృష్టికర్త ఆల్ట్‌మ్యాన్ అన్నాడు. ఆర్టీఫిషియల్ ఇంటెలెజెన్స్ వృద్ధి చెందే కొద్దీ దాని ప్రభావం సమాజం మీద, ఉద్యోగాల మీద పడకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించాడు.

ఏఐ(AI) టెక్నాజీ ఇప్పుడిప్పుడే ఆరంభమై సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. కొంతమంది దీని ద్వారా ఉద్యోగ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని వాదిస్తుంటే, మరికొంత మంది మానవుల సహాయం లేకుండా పూర్తిగా పనిచేయడం కుదరదని మరో వర్గం వాదిస్తోంది. పలు రంగాల్లో ఇప్పటికే మానవ ఉద్యోగులు చేసే స్థానాల్లో రోబోలు, ఛాట్‌బాట్‌లు భర్తీ చేస్తున్నాయి.


ఈ నేపథ్యంలో ఛాట్‌జీపీటీ మాస్టర్‌మైండ్, ఓపెన్ ఏఐ(OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఐ టెక్నాలజీ ప్రభావంపై వివిధ సందర్భాల్లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఇవే..

ChatGPT పురోగతి, పరిమితులు: 2022, నవంబర్‌లో ఛాట్‌జీపీటీ ఆవిష్కరించినప్పటి నుండి గణనీయమైన పురోగతిని సాధించిందన్నాడు. ఇది ఇంతటితో ఆగకుండా ఇంకా మెరుగుపడుతుందని ఆల్ట్‌మాన్ అన్నాడు. అయినప్పటికీ, AI టూల్‌ గుడ్డిగా నమ్మదగినది కాదని, దాని పరిమితులు దానికి ఉంటాయన్నాడు.

మానవ ఉద్యోగాలను భర్తీ చేయనున్న AI: ఉద్యోగ అవకాశాలపై AI ప్రభావంపై కూడా ఆందోళన వ్యక్తంచేశాడు. ఇది మానవ ఉద్యోగాల భర్తీకి దారితీస్తుందని పేర్కొంది. టెక్ నిపుణులతో సహా చాలా మంది వ్యక్తులు, ChatGPT వంటి AI సాధనాలపై ఇలాంటి ఆందోళనలను ఎప్పటినుంచో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


మానవాళిపై AI ప్రభావం: ది అట్లాంటిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మానవాళిపై AI ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని ఆల్ట్‌మాన్ హెచ్చరించాడు. కొంతమంది డెవలపర్లు AI కేవలం మానవ ప్రయత్నాలను భర్తీ చేస్తుంది కానీ ఉద్యోగాలను భర్తీ చేయదని అంటుండగా, ఆల్ట్‌మాన్ ఉద్యోగాలు "ఖచ్చితంగా" ప్రభావితమవుతాయని అన్నాడు.

మరింత శక్తివంతమైన AI: చాట్‌జిపిటి కంటే మరింత శక్తివంతమైన AIని సృష్టించే సామర్థ్యాన్ని OpenAI కి ఉందన్నాడు. అయితే దీనిని ఇప్పుడే విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. అడ్వాన్స్‌డ్ సాంకేతికతతో వచ్చే అటువంటి యాప్‌ల వినియోగించే స్థితిలో లేరని అన్నాడు.

భారత పర్యటన, AI భవిష్యత్తు: భారతదేశ పర్యటనలో ఆల్ట్‌మాన్ ఉద్యోగాలను భర్తీచేయడంలో AI సామర్థ్యాలపై ఆందోళనలను వ్యక్తం చేశాడు. AI కారణంగా కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయని అతను అంగీకరించాడు, అయితే కొత్త మరియు మెరుగైన ఉద్యోగాలు కూడా ఉద్భవించగలవని నమ్ముతున్నానన్నాడు. దేశంలో AI స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి OpenAI ప్రణాళికలను ప్రకటించారు.





Tags

Read MoreRead Less
Next Story