హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో షాకింగ్ న్యూస్

హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో షాకింగ్ న్యూస్

కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఫైజర్, ఆస్ట్రాజెనికా లాంటి ఫార్మా దిగ్గజాలున్నాయి. భారత్ లో కూడా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కూడా మూడో దశ ప్రయోగాలు చేస్తోంది. తాజాగా ఈ ప్రయోగాల్లో జరిగిన ఓ సంఘటన బయటకొచ్చింది. ICMR అధికారులు ఈ విషయాన్ని బయటపెట్టారు. క్లీనికల్ ట్రయల్స్ లో భాగంగా తొలి దశలో వెస్ట్ ప్రాంతంలోని ఓ రాష్ట్రంలో 35 ఏళ్ల యువకుడికి టీకా ఇవ్వగా చెడు ఫలితం వచ్చినట్టు గుర్తించారట. ఆగస్టులో ఇది జరిగినట్టు తెలుస్తోంది. అటు కంపెనీ ఛైర్మన్ డాక్టర్ క్రిష్ణా ఎల్లా కూడా ప్రకటించారు.

వ్యాక్సిన్ ఇచ్చిన 24గంటల్లో దుష్ఫభావం చూపినట్టు గుర్తించారట. వైరల్ న్యుమానిటీస్ తో ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. వారం పాటు ఆసుపత్రిలో ఉంచి పూర్తిగా చికిత్స అందించి కోలుకున్న తర్వాత ఇంటికి పంపారట. అయితే వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందన్నది పూర్తిగా పరీక్షలు జరిపినట్టు ప్రకటించారు.

వాస్తవానికి ఇలాంటి క్లీనికల్ ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్స్ట్ సహజంగా కనిపిస్తుంటాయి. అయితే చాలావరకు కంపెనీలు సైడ్ ఎపెక్ట్ కనిపిస్తే ట్రయల్స్ ఆపేస్తుంటాయి. ఇటీవ ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు ప్రయోగాలు ఆపేసి.. పూర్తిగా పరిశీలించి స్టడీ చేసిన తర్వాతే మళ్లీ కొనసాగించారు. కానీ భారత్ బయోటిక్ కొనసాగించింది. నవంబర్ 16 నుంచి మూడోదశ ప్రయోగాలు జరుగుతున్నాయి. కోవాగ్జిన్ పేరుతో భారత్ బయోటిక్ డెవలప్ చేస్తున్న ప్రయోగాలకు ICMR సహకరిస్తుంది. ఇరు సంస్థలు కలిసి దీనిని డెవలప్ చేస్తున్నారు.

నిబంధనలు పూర్తిగా పాటిస్తూ.. ఎప్పటికప్పుడు నివేదికలు నియంత్రణ సంస్థలకు ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెగ్యులేటరీ బాడీస్ అనుమతి తీసుకున్న తర్వాతే కంపెనీ తదుపరి ట్రయల్స్ చేపట్టిందని కంపెనీ తెలిపింది.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story