కోవ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ

కోవ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ

ఫార్మారంగ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న కోవ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫేజ్‌ వన్‌, టు ట్రయల్స్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్‌కు భారత్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతులిచ్చింది. తొలి రెండు దశల్లో వెయ్యి మందికిపైగా ఈ ట్రయల్స్‌ జరుగగా.. ఇప్పుడు ఏకంగా 26వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో వలంటీర్లపై ప్రయోగించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. అయితే మొదటి, రెండో దశలో వెయ్యి మందికిపైగా వ్యక్తులపై ప్రయోగాలు నిర్వహించగా.. తుది దశలో పెద్ద మొత్తంలో 26వేల మందిపై ప్రయోగాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారని సంస్థ ప్రకటించింది. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుంది.

భువనేశ్వర్‌, ఢిల్లీ, ముంబై, భూపాల్‌లో రెండేసిచోట్ల, అహ్మదాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, రోహ్‌తగ్‌, గోవా సహా పలు ప్రాంతాల్లోని ఒక్కో ఆస్పత్రిలో ట్రయల్స్‌ను ప్రారంభించారు. తెలంగాణలో నిమ్స్‌లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఏపీలో గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో ట్రయల్స్‌ జరుగుతాయి.

క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారిని రెండు గ్రూప్ లుగా విభజించి ఇంట్రా మస్క్యూలర్ ఇంజెక్షన్లు ఇవ్వనున్నారు. మొత్తం 26 వేల మందిలో 13వేలమందికి ఆరు గ్రాముల మైక్రో కోవ్యాక్సిన్ ఇంజెక్షన్లు రెండు లేదా.. ప్లాసిబో రెండు డోసులను ఇవ్వనున్నారు. వాలంటీర్ల హెల్త్‌ కండీషన్స్‌, వారిపై కరోనా ప్రభావాన్ని ఏడాది పాటు పరిశీలించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story