కోవిడ్ వ్యాక్సిన్ ధర చూస్తే షాకవుతారు?

కోవిడ్ వ్యాక్సిన్ ధర చూస్తే షాకవుతారు?

గత కొద్దిరోజులుగా వ్యాక్సిన్ పై సానుకూల ప్రకటనలు వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి గుడ్ న్యూస్ చెబుతున్నాయి. ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ త్వరలో వస్తుందని.. ఇది 93శాతానికి పైగా సక్సెస్ అయిందని ప్రకటించింది. ఇది ప్రకటించిన వారంలోపే ఆక్సఫర్డ్ కంపెనీ వ్యాక్సిన్ కూడా దాదాపు 95శాతం సక్సెస్ అయింది. అనుమతులు వస్తే క్రిస్మస్ కే విడుదల చేయాలని చూస్తున్నాయి. కానీ ఇంకా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.

బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ ఆక్సఫర్డ్ వర్శిటీతో కలిసి కొవాక్స్ వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తుంది. ఇదే ప్రస్తుతం చివరి దశలో ఉంది. దీనికి ఇండియాలో ఫార్మా పార్టనర్ గా పూనెకు చెందిన సీరమ్ కంపెనీ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు. అదే ధరపై ఓ స్పష్టత కూడా ఇచ్చారు. తమ వ్యాక్సిన్ ధర 3 నుంచి 4 డాలర్లు ఉంటుందట. అంటే దేశీయ మార్కెట్లో దీనిని రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయిస్తామంటోంది కంపెనీ. వంద కోట్ల డోస్ లు తయారుచేయడానికి ఏర్పాట్లు చేశామని కంపెనీ CEO అదర్ పూనావాలా చెబుతున్నారు. అయితే మొత్తానికి ధరపై ఉన్న అనుమానాలన్న తొలిగినట్టే.. మార్కెట్లో ఇది అందుబాటులోకి వచ్చిన వెంటనే కొనడానికి పెద్దగా ఖర్చు కాదన్నట్టే. అయినా అటు ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇవ్వడానికి కూడా రెడీ చేస్తుంది.

కంపెనీ వ్యాక్సిన్ వినియోగం కోసం అత్యవసర అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనుమతిస్తే మార్కెట్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో రిస్క్ జోన్లలో ముందుగా వ్యాక్సిన్ ఇచ్చి.. తర్వాత సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతామని కంపెనీ అంటోంది. మార్చి నాటికి 30 నుంచి 40 కోట్లు 2 డోస్ వ్యాక్సిన్ రెడీ చేయడానికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చుకుంటోంది కంపెనీ. నెలకు 10 కోట్లమందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగే సామర్థ్యం తమకుందని సీరమ్ సంస్థ చెబుతోంది.

ముందు ఇండియాలో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆఫ్రికా, నేపాల్, ఇతర దేశాలకు సరఫరా చేయడానికి కూడా సిద్ధమవుతోంది. మొత్తానికి వ్యాక్సిన్ రావడమే ఆలస్యం.. అన్ని రెడీగా ప్రాపర్ ప్లానింగ్ ఉంది. మరి ఎప్పటికి అనుమతులు వస్తాయో... మరెప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story