కీ బోర్డుపై టైపింగ్ చేస్తే త‌ప్పులు దొర్లుతున్నాయా? ఇలా చేయండి

కీ బోర్డుపై టైపింగ్ చేస్తే త‌ప్పులు దొర్లుతున్నాయా? ఇలా చేయండి
Keyboard Typing Mistakes: గ‌తంలో పేప‌ర్ మీద రాయాలంటే క‌లం ఉప‌యోగించే వారు.అధునిక కాలంలో అంత‌ర్జాలం అందుబాటులోకి రావ‌డంతో

Keyboard Typing Mistakes: గ‌తంలో పేప‌ర్ మీద రాయాలంటే క‌లం ఉప‌యోగించే వారు. అధునిక కాలంలో అంత‌ర్జాలం అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌తి ఇంట్లో కంప్యూట‌ర్, లాప్ టాప్, ట్యాబ్స్ వంటివి అంబాటులో ఉంటున్నాయి. అయితే కంప్యూటర్ ఉప‌యోగించే ఎంత అనుభ‌వం ఉన్న‌వారైనా స‌రే.. టైపింగ్ విష‌యంలో ప్ర‌తిసారి త‌డ‌బ‌డుతుంటారు. ఇలా అనేక‌సార్లు త‌ప్పులు చేస్తుంటారు.

ముందు కాసేపు బాగానే ఉండి.. ఆ రెండు మూడు లైన్లు కొట్టిన త‌ర్వాత‌ త‌ప్పులు ఎందుకు వ‌స్తాయో అర్థం కావు. దీనికో కారణం ఉంది. చాలామంది గంటలతరబడి అలాగే కంప్యూటర్‌ ముందు కూర్చుని టైపింగ్‌ వంటి పనిచేస్తుంటారు. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోష్చర్‌లో కూర్చుంటే అది 'స్టాటిక్‌ లోడింగ్‌' అనే పరిస్థితికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు సైతం 30 శాతం మందగిస్తాయి. ఈ కండిషన్‌లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది.

అయితే, కొందరిలో అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. దాంతో ఆక్సిజన్‌ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్నా కొద్దిసేపట్లోనే అలసిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వారు ఏం చేయాలి. అనేక‌దా మీ సందేహం ఏవ‌రికైనా త‌ప్ప‌కుండా వ‌స్తుంది.

ఇలా కంప్యూటర్‌పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అందుకే దీర్ఘకాలంపాటు కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు రోజు వ్యాయామం చేయాలి. వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిత్యం కంప్యూట‌ర్ ముందు కూర్చునేవారు కొద్ది కొద్ది సేపటికోసారి లేచి కాసేపు తిరగాలి. అలాగే కంప్యూటర్‌ స్క్రీన్‌ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఈ సూచనలను పాటిస్తే మీకు త‌ప్పులు దొర్లే స‌మ‌స్య చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

Tags

Read MoreRead Less
Next Story