Phone Hacking: మీ ఫోన్ హ్యాక్ అయిందేమో..! ఇలా చెక్ చేసుకోండి

Mobile Hackers
Phone has been hacked: దేశవ్యాప్తంగా 'పెగాసస్' స్పైవేర్(Pegasus Spyware) ప్రకంపనలు సృష్టిస్తుంది. 'పెగాసస్' IOS ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లు హ్యాకింగ్ చేసినట్లుగా నిపుణులు గుర్తించారు. దాంతో రాజకీయంగా ఈ అంశం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన NSO.. నిఘా కార్యకలాపాల కోసం 5 ఏళ్ల క్రితం 'పెగాసస్' స్పైవేర్ రూపొందించింది. అయితే పెగాసస్ వల్ల అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ హ్యాకింగ్ వ్యవహారం సామాన్యులను కూడా ఉలిక్కిపడేలా చేస్తుంది.
అయితే ఒక్కసారి మీ ఫోన్‌లోకిగానీ ఈ స్పైవేర్ దూరిందంటే కనిపెట్టడం చాలా కష్టం. స్పైవేర్ ఏటాక్ చేస్తే మొబైల్ లో ఆర్థికపరమైన సమాచారంతోపాటు ఫొటో గ్యాలరీ, ఫోన్ కాల్స్, sms, మెల్స్, వంటిని దాని ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. స్పైవేర్ బారిన మీ ఫోన్ పడిందో లేదో ఇలా తెలుసుకోండి.
1. మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం
మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం పడిపోతే.. మీ ఫోన్‌లో ప్రమాదకర యాప్స్ ఉన్నాయని భావించాలి. మీ ఫోన్‌లో అనసవర యాప్స్ ఉంటే మాత్రం జాగ్రత్తపడాలి. మోసపూరిత కోడ్‌ను వినియోగించి మాల్‌వేర్ అటాక్ అయిందని భావించొచ్చు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లు నడుస్తూ ఉండటం వల్ల కూడానూ బ్యాటరీ కన్జప్షన్ ఉంటుంది. కొన్ని యాప్స్ నియంత్రించాలి. మళ్లీ అదే సమస్య వస్తే ఆలోచించాల్సిందే. డౌన్‌లోడ్ చేయకుండానే వాటిని తొలగించినా.. మళ్లీ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంటే హ్యాకర్ లేదా స్పైవేర్ బారిన పడినట్లు గుర్తించాలి.
2. స్మార్ట్‌ఫోన్ స్లో అయిపోవడం
ఏదైనా యాప్‌ను, గేమ్ ఓపెన్ చేస్తే స్లోగా ఓపెన్ కావడం చూస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్‌వేర్ ఉండే అవకాశం ఉంది.
3. డేటా
మీ ఫోన్ డేటా సాధారణంగా వినియోగించే దానికంటే పెరిగిపోతే మాల్‌వేర్ గురించి ఆలోచించాలి. ప్రమాదకరమైన యాప్‌లు, సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీ మొబైల్ డేటాను వినియోగిస్తూ ఉండొచ్చు. మీమ్మల్నీ ట్రాక్ చేసే ప్రమాదం పొంచి ఉంది.
4. యాప్స్ సడెన్‌గా క్రాష్
యాప్స్ సడెన్‌గా క్రాష్ అవ్వడం, లోడింగ్ సమయంలో సమస్యలు తలెత్తితే జాగ్రత్తగా ఉండాలి.
5. వెబ్‌సైట్లు
మీ ఫోన్‌లో వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తే.. గతంలో ఉన్నవాటికి భిన్నంగా వెబ్‌సైట్లు కనిపిస్తే మాల్‌వేర్ దాడిగా గుర్తించాల్సి ఉంటుంది.
6. పాప్-అప్స్
వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద పాప్-అప్స్ ఎక్కువగా కనిపిస్తే క్లిక్ చేయకండి. పాప్ అప్స్ ద్వారా మాల్‌వేర్ మీ ఫోన్ లోకి చొరబడే అవకాశం ఉందని భావించాల్సి ఉంటుంది.
7. మెసేజ్‌లలో అసభ్యకరమైన వొర్డ్స్
మీ ఫోన్ Long Text, Calls ఏవైనా సరే మీరు చేయలేదని గుర్తిస్తే మాత్రం Hacker బారిన పడినట్టుగా అనుకోవచ్చు. మెసేజ్‌లలో అసభ్యకరమైన వొర్డ్స్ ఉండే అవకాశం ఉంది.
8. రిసీవ్ చేసుకోని ఇమేజ్‌లు
స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల్లో మీరు రిసీవ్ లేదా ఎవరి దగ్గరి నుంచైనా రిసీవ్ చేసుకోని ఇమేజ్‌లు ఉన్నట్లు గుర్తిస్తే మాల్వేర్ పనిగా భావించాల్సి ఉంటుంది. కెమెరా హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్లిందని గుర్తించాల్సివుంది.
9. ఫ్లాష్ లైట్ ఆన్
మీ ఫోన్ ఉపయోగించకుండా ఫ్లాష్ లైట్ ఆన్ అవుతూ ఉంటే కూడానూ హెచ్చరికగా భావించాలి.
10. ఫోన్ హీట్
యాప్స్, గేమ్స్, మూవీస్ లాంటివీ వాడకుండానే ఫోన్ హీట్ అవుతున్న హ్యాకర్స్ దాడి చేస్తున్నారని భావించాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com