మీరు మొబైల్ అధికంగా వాడుతున్నారా..రేడియేషన్ నుంచి ఇలా తప్పించుకోండి..!

Mobile phone radiation: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి అరచేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. కరోనా రక్కసి కారణంగా అంతా ఆన్లైన్ యుగంలో కంటిన్యూ అవుతున్నాం. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. పిల్లలకైతే ఆన్ లైన్ తరగతులు. ప్రతి అవసరానికి సెల్‌ఫోన్ చాలా అవసరం. అయితే, మొబైల్స్ వల్ల హానికలిగించే రేడియషన్ ముప్పు కొంత పొంచి ఉంటుంది. సెల్ నుంచి వచ్చే రేడియోషన్ పూర్తిగా కంట్రోల్ చేయలేం. కానీ దాన్ని తగ్గించవచ్చు. రేడియేషన్ ఎలా తగ్గించాలో ఇప్పుడు చూద్దాం.
కాలింగ్ కి బదులుగా టెక్స్ట్ మెసేజిలు పంపడం, కాల్స్ మాట్లేటప్పుడు బ్లూటూత్, లేదా ఇయర్ ఫోన్స్ వాడాలి. కాల్స్ మాట్లాడేటప్పుడు బ్రెయిన్ ద్గగరగా ఫోనులో వుండే యాంటెన్నా ఉంటుంది. దాని వలన హాని కలిగే అవసరం ఉంది. ఇయర్ ఫోన్స్ వాడి రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు.
అతిగా ఫోన్ వాడకం తగ్గించాలి. U.S కి చెందిన, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) 2011 సర్వే ప్రకారం.. రేడియేషన్ ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమితనం వంటి మరెన్నో రుగ్మతలకు కారణమవుతుంది.
ఫోన్ లో సిగ్నల్ వీక్ గా ఉన్నపుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి..మీరు అలారం ఆ ఫోన్ తల దగ్గర పెట్టి నిద్రించకుడదు. అలా చేయడం వల్ల ఎక్కవ స్థాయిలో రేడియేషన్ మీ దగ్గర ఉంటుంది. ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్నా సరే దానిలోని యాంటెన్నా, బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి. కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం. యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యధికంగా తరంగాలను విడుదల చేస్తుంది
ఫోన్ జేబులో లేదా పౌచ్ లో ఎప్పుడు మీ తోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్ని తగ్గించండి. ఫోన్ ఎల్లప్పుడు మీతో ఉంటే మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది. రాత్రి నిద్రపోయే సమయంలో ఫోన్ మీకు కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండేలా చూసుకోండి. రేడియేషన్పీ పూర్తిగా కంట్రోల్ చేయకపోయినా.. చాల వరకు తగ్గించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com