Indian navy: స్వదేశీ సాంకేతికతతో భారీ టార్పిడో

Indian navy: స్వదేశీ సాంకేతికతతో భారీ టార్పిడో
స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో విజయవంతంగా ఛేదించింది.

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో విజయవంతంగా ఛేదించింది.ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నేవీ, డీఆర్‌డీవో సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయని తెలిపింది భారత నౌకాదళం. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన హెవీ వెయిట్‌ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని, ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్తులో తమ పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనమంటూ ట్వీట్‌ చేసింది. హిందూ మహా సముద్రంలో చైనా కారణంగా ముప్పు పెరుగుతున్న వేళ.. నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story