Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ GT 10 ప్రో మొబైల్ విడుదల, నథింగ్ ఫోన్‌లానే..

Infinix GT 10 Pro: ఇన్ఫినిక్స్ మొబైల్స్ మిడ్ రేంజ్ విభాగంలో, గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో మోడల్‌ను ఆవిష్కరించింది. లుక్స్ పరంగా నథింగ్(Nothing) మొబైల్ మోడల్‌ని పోలి ఉంది. ఫోన్ వెనక భాగంలో పారదర్శమైన డిజైన్‌తో పాటు స్పందించే ఎల్‌ఈడీ(Responisive LED) లైట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌పై పనిచేయనుంది.
కేవలం 8జీబీ+256జీబీ వేరియంట్‌ని మాత్రమే అందిస్తున్నారు. దీని ధరను 19,999 గా నిర్ణయించారు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. సైబర్ బ్లాక్, మిరేజ్ సిల్వర్ కలర్లలో లభించనుంది.
ఇందులో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే(AMOLED)ఉంది. ఈ స్క్రీన్ 120Hz నుంచి 360Hz రిఫ్రెష్ రేట్ వరకు మద్దతిస్తుంది. గరిష్ఠంగా 900 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం మీద రూపొందించిన XOS13 తో ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
Guess karo hum kahan hai? #Gtverse mein! 🤪
— Infinix India (@InfinixIndia) August 3, 2023
Toh batao sab, karein launch ka live thread chalu? 🤩#InfinixGT10Pro #OutplayTheRest pic.twitter.com/pwU6mS2Rec
8జీబీ+256జీబీ(8GB+128GB) వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. వర్చువల్‌గా ర్యామ్(RAM)ని 16జీబీ దాకా పెంచుకునే సౌకర్యం కూడా ఉంటుంది. గంటల తరబడి గేమ్స్ ఆడేవారి కోసం ఆటంకాలు లేకుండా ఉంచే కూలింగ్ వ్యవస్థ కోసం లిక్విడ్ వేపర్ ఛాంబర్‌ని ఉంచారు.
ఫోన్ వెనక భాగంలో LED ఇండికేటర్‌ని ఉంచారు. ఫోన్‌లో వివిధ రకాలైన అవసరాల కోసం ఈ ఇండికేటర్‌ను మనకు అనుగుణంగా మార్చుకునే వీలుంటుంది.
108ఎంపీ ప్రధాన కెమెరా, రెండు 2ఎంపీ కెమెరా సెన్సార్లతో మొత్తం 3 కెమెరాలతో కెమెరాని అమర్చారు. సెల్ఫీ విభాగం కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఉంచారు.
5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో ఛార్జర్ పనిచేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com