Instagram : టేక్ ఏ బ్రేక్ .. ఇన్‌స్టాగ్రామ్‌లో సరి కొత్త ఫీచర్..!
Instagram : సోషల్ మీడియాలో ఇప్పుడు యువత ఎక్కువగా గడిపేస్తుంది. ఈ క్రమంలో వారి మేలు కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది.

Instagram : సోషల్ మీడియాలో ఇప్పుడు యువత ఎక్కువగా గడిపేస్తుంది. ఈ క్రమంలో వారి మేలు కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. యూజర్ ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే టేక్ ఏ బ్రేక్ (Take A Break)పేరుతో ఓ మెసేజ్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే.. ఎంతసేపు బ్రేక్ తీసుకోవాలో కనిపిస్తుంది. నచ్చిన పాటలు వినమని, ముఖ్యమైన పనులను చేసుకోమని సూచిస్తుంది. ఈ ఫీచర్ గురించి యువతకు అవగాహన కల్పించేందుకు వుయ్ ది యంగ్ (We The Young) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌తో కలిసి 'బ్రేక్ జరూరీ హై' అనే క్యాంపెన్‌ను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్‌లన్నింటికి టేక్ ఏ బ్రేక్ ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లకు రానున్న వారాల్లో క్రమంగా వస్తుంది.ఇదేకాకుండా తమ పిల్లలు ఎంతసేపు ఇన్‌స్టాగ్రాం చూస్తున్నారనేది తెలుసుకునేలా తల్లిదండ్రులు, గార్డియన్స్ కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. కాగా ఇప్పటికే గూగుల్, శాంసంగ్ వంటి సంస్థలు ఈ తరహ ఫీచర్ లను తీసుకొచ్చాయి.
RELATED STORIES
Tata Motors: బిగ్ డీల్.. ఫోర్డ్‌ను కొనేసిన టాటా మోటార్స్
8 Aug 2022 8:00 AM GMTGold and Silver Rates Today: మార్పు లేని బంగారం, వెండి ధరలు..
8 Aug 2022 12:51 AM GMTGold And Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు..
6 Aug 2022 1:06 AM GMTRBI Repo Rate: మరోసారి రెపోరేటు పెంచేసిన RBI.. అనుకున్నదానికంటే...
5 Aug 2022 9:37 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం.. స్వల్పంగా వెండి...
5 Aug 2022 1:05 AM GMTAirtel 5G: 5జీ సేవలకు సంబంధించి ఎయిర్టెల్ కీలక ప్రకటన..
4 Aug 2022 3:30 PM GMT