వాట్సాప్ మెమరీ క్లీన్ చేయాలంటే..

వాట్సాప్ మెమరీ క్లీన్ చేయాలంటే..
మొబైల్ డేటా వాడుతున్నప్పుడు ఆటో డౌన్‌లోడ్‌లో ఏ ఫోటోలు డౌన్‌లోడ్ అవ్వాలి, వైఫై వాడుతున్నప్పుడు ఏవి డౌన్‌లోడ్ అవ్వాలి

స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉన్నా క్లీన్ చేయకపోతే ఫోన్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ మొబైల్ స్టోరేజ్ నిండి పోయింది. ప్లీజ్ క్లీన్ అని మెసేజ్ వచ్చినా ఒకే అంటూ వదిలేస్తామే కానీ అంతగా పట్టించుకోం. మీ మొబైల్ మెమరీకి ఏవిధమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చేసి చూస్తే సరి.

మీ మొబైల్‌‌లోని గ్యాలరీలో ఉన్న ఫొటోలు ఒక్కోసారి ఎలా వచ్చాయో అర్థం కాదు. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోని స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌లోకి వెళ్లి అందులో మీడియా ఆటో డౌన్‌లోడ్ సెక్షన్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొబైల్ డేటా వాడుతున్నప్పుడు ఆటో డౌన్‌లోడ్‌లో ఏ ఫోటోలు డౌన్‌లోడ్ అవ్వాలి, వైఫై వాడుతున్నప్పుడు ఏవి డౌన్‌లోడ్ అవ్వాలి అని ఆప్షన్లు ఉంటాయి. అందులో ఉన్న అన్నింటికీ టిక్ మార్కుల తీస్తే సరిపోతుంది. ఇకపై మీరు డౌన్ లోడ్ చేస్తే ఆ ఇమేజ్ కానీ ఫోటో కానీ వస్తుంది.

అదే ఐవోఎస్లో అయితే వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో మీడియా ఆటో డౌన్‌లోడ్ సెక్షన్‌లో కింద ఫోటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ అని ఆప్షన్‌లో నెవర్, వైఫై, వైఫై అండ్ సెల్యులార్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. అందులో నెవర్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇక ఛాట్ మెసేజెస్ ఓపెన్ చేసి ఏమేం ఉంటాయో చూసి డిలీట్ చేయాలనుకుంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌లోకి వెళ్లి అందులో మేనేజ్ స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఒక్కో వ్యక్తి కాంటాక్ట్ నుంచి వచ్చిన ఫోటోలు, వీడియోలు కాంటాక్ట్ లిస్ట్‌లా కనిపిస్తాయి. అందులో మీకు అవసరం లేదు అనుకున్నవి డిలీట్ చేసేయొచ్చు. 5ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఐవోఎస్‌లోనూ ఇదే పద్దతిని పాటించాలి.

వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు/వీడియోలు అన్నీ ముఖ్యమైనవి కావనే విషయం మీకు తెలిసిందే. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఫన్నీ కోట్స్, మీమ్స్ ఇలానే చాలానే వస్తుంటాయి. అవి మీ మొబైల్ గ్యాలరీలో కనిపించాల్సిన అవసరం ఉండదు. కానీ మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ క్లిక్ చేశారు కాబట్టి గ్యాలరీలో తప్పక కనిపిస్తాయి. ఈ ఇబ్బంది తొలగిపోవడానికి ఓ ఆప్షన్ ఉంది. దీని కోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ఛాట్స్ ఆప్షన్‌లోకి వెళ్లండి. అందులో మీడియా విజబులిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మీ వాట్సాప్‌లో వచ్చిన ఫోటోలు/వీడియోలో గ్యాలరీలో కనిపించవు. ఐవోఎస్‌లో అయితే సేవ్ టు కెమెరా రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్/డిజేబుల్ చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story