మరో మైలురాయిని దాటిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ 49

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PSLV C49 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు కక్కుకుంటూ... నింగిలోకి దూసుకెళ్లింది PSLV C49. సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి... ఈ ప్రయోగం చేపట్టారు. సరిగ్గా మధ్యాహ్న 03.12 నిమిషాలకు రాకేట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో భారత్ కు చెందిన EOS -01 ఉపగ్రహంతో పాటు మరో 9 అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్సంబర్గ్‌కు చెందిన 4 ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక చిన్నతరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.
ఇక మన దేశం పంపిన EOS- 01 ఒక నిఘా ఉపగ్రహం. ఇందులోని సింథటిక్ అపెర్చర్ రాడార్ ద్వారా భూమిపై కొద్దిపాటి కదలికలను కూడా గుర్తించేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. వాహకనౌకకు 175 కోట్లు, ఉపగ్రహానికి 125 కోట్ల వరకు వ్యయం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే ఇస్రో తన ప్రకటనలో వ్యవసాయం, అటవీభూముల పరిశీలన, విపత్తు నిర్వహణలకు మద్దతు వంటి అంశాలకు EOS- 01 తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com