Twitter rival: ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్ యాప్... మస్క్‌కు మాములు షాక్ కాదుగా...

ట్విట్టర్‌ను ప్రయోగశాలగా మార్చిన టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌కు భారీ షాక్ తగిలింది. మస్క్‌ను మరింత ఇబ్బందుల్లో నెట్టేలా మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్ పేరుతో ట్విటర్ తరహా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ యాప్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థ్రెడ్ యాప్‌ను జులై 6న విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నా ఈ తేదీపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. థ్రెడ్ యాప్ వివరాలు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. థ్రెడ్ యాప్ విడుదల తర్వాత ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు వారి ఇన్‌స్టా ఐడీతో ఈ మైక్రోబ్లాగింగ్ యాప్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్ గురించి సంస్థ ఉద్యోగులతో మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
థ్రెడ్ యాప్ కోసం డీ సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ సంస్థ యాక్టివిటీ పబ్‌తో మెటా చేతులు కలిపింది. ఈ సంస్థ వెబ్ సర్వర్‌లకు వెబ్‌బ్రౌజర్‌లు థ్రెడ్ యాప్ ఇంటర్ ఫేస్‌కు అనుసంధానం చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ యాప్ ఇంటర్నల్ కోడ్ నేమ్ ప్రాజెక్ట్ 92 అని తెలుస్తోంది. జుకర్‌బర్గ్ సారధ్యంలోని మెటా సెలెక్టెడ్ సెలబ్రిటీలు, క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లతో ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ను కొన్ని నెలలుగా పరీక్షించినట్లు తెలుస్తోంది. థ్రెడ్ యాప్ తొలుత టెక్ట్స్ ఆధారిత యాప్‌గా రానున్నది. ఆ తర్వాత వీడియోలు, ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసుకోగలిగే విధంగా అప్‌డేట్ చేస్తారని సమాచారం.
థ్రెడ్ యాప్ జూలై 6 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. థ్రెడ్ యాప్ నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌కి లింక్ అయి ఉంటుంది. ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు సహా అన్నింటినీ ఈ థ్రెడ్ యాప్‌లో చర్చించవచ్చని మెటా అధికారి ఒకరు తెలిపారు. మీ ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మకతను ప్రపంచంతో పంచుకోవడానికి థ్రెడ్ మంచి వేదికని ఆయన వివరించారు. థ్రెడ్ యాప్‌కి ఇన్‌స్టాగ్రామ్‌కి దగ్గరి సంబంధం కలిగి ఉన్నప్పటికీ వీటి మధ్య చాలా వ్యాత్యాసం ఉందని మెటా వర్గాలు తెలిపాయి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను కలిపితే అదే థ్రెడ్ యాప్ అని తెలుస్తోంది. ట్విటర్‌ను ల్యాబ్ చేసి ఇష్టం వచ్చిన రూల్స్ పెడుతున్న మస్క్‌పై యూజర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ట్విటర్‌కు ప్రత్యామ్నాయమైన బ్లూ స్కై, మాస్టోడాన్ లాంటి మైక్రోబ్లాగింగ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ సమయంలో థ్రెడ్ యాప్ వస్తే ట్విట్టర్‌కు గట్టి పోటి తప్పదని నెట్ ప్రపంచం అంచనా వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com