విండోస్ 11 వచ్చేసింది..!

Microsoft Windows 11 roll out: మైక్రోసాఫ్ట్ సంస్థ తన తదుపరి ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11ను తీసుకువచ్చింది. ఇటీవలే వర్చ్యువల్ మీట్ లో మైక్రోసాఫ్ట్ ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. ఈ సాఫ్ట్‌వేర్ అన్ని డెస్క్‌టాప్‌పై అన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు పని చేస్తాయి. గేమింగ్ కోసం కూడా కన్ఫిగర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మాక్ఓఎస్, క్రోమ్ఓఎస్‌లకు పోటీని ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని మార్పులను తీసుకువచ్చింది. మైక్రోసాఫ్ట్ గతంలో విండోస్ 11 విడుదల తేదీని ప్రకటించింది. విండోస్ 11 లాంచ్ సమాచారం అనుకోకుండా కొన్ని ఇంటెల్ డ్రైవర్ డాక్యుమెంటేషన్‌లో లీక్ అయింది. తొలుత జూన్ నెల ఆఖర్లో లాంచ్ చేస్తారని భావించారు. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్, అక్టోబర్ 2021 - నవంబర్ 2021 మధ్య కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రావచ్చునని తెలుస్తుంది.
విండోస్ 11 ఫీచర్లు
గతంలో అన్ని స్టార్ట్ మెనూ ఎడమవైపు ఉండేది. అలా కాకుండా ఈసారి మధ్యలో ఉండనుంది. విండోస్ 10లో ఉండే లైవ్ టైల్స్‌ను విండోస్ 11లో తొలిగించారు. ఇందులో అలెర్ట్స్, నోటిఫికేషన్లకు ప్రత్యేకమైన సౌండ్లు అందించనున్నారు. కొత్త థీమ్స్, కొత్త వాల్ పేపర్స్, మెరుగైన డార్క్‌మోడ్‌ను ఇందులో అందించారు. వీటిలో విడ్జెట్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఇందులో స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. మల్టీటాస్కింగ్ కోసం డెస్క్‌టాప్‌ను కూడా కొత్త తరహాలో డిజైన్ చేసింది. మైక్రోసాఫ్ట్ స్టోర్‌ను కూడా ఇందులో మెరుగుపరిచారు. సెర్చ్ సామర్థ్యాన్ని పెంపొందించడమే, డిజైన్‌కు కూడా మెరుగులు దిద్దారు.
వి 11లో మెరుగైన టచ్ కీబోర్డు
జిఫ్ ఫీచర్
వాయిస్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్
మైక్రోసాఫ్ట్ ఇందులో టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఎన్‌హేన్స్ చేసింది.
డీఫాల్ట్‌గా టీమ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించారు.
మ్యూట్ అండ్ అన్‌మ్యూట్ ఫీచర్లు
ఎడ్జ్ బ్రౌజర్‌లో మార్పలు.
గేమర్ల కోసం కొత్త ఫీచర్ల అందుబాటులోకి తెచ్చింది.
ఆటో హెచ్‌డీఆర్ సపోర్ట్, డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్,
ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్‌లు
క్లౌడ్ గేమింగ్, ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ యాక్సెస్‌ను ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్ అందుబాటులో ఉంటుంది.
డెవలపర్ల కోసం జీరో రెవిన్యూ షేర్
మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఉండే యాప్స్‌కు వచ్చే రెవిన్యూ నుంచి కంపెనీ ఆశించదు
ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం అమెజాన్ యాప్ స్టోర్
మైక్రోసాఫ్ట్ ఇందులో ఇంటిగ్రేట్
ఇంటెల్ బ్రిడ్జ్ టెక్నాలజీ
మొబైల్ డివైస్‌లపై మెరుగైన బ్యాటరీ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com