Jim Green: త్వరలోనే మనుషులు, ఏలియన్స్ కలుస్తారు..: నాసా మాజీ శాస్త్రవేత

Jim Green: త్వరలోనే మనుషులు, ఏలియన్స్ కలుస్తారు..: నాసా మాజీ శాస్త్రవేత
Jim Green: మనుషులు, ఏలియన్స్‌ను కలిసే రోజు దగ్గర్లోనే ఉందని నాసా మాజీ శాస్త్రవేత్త జిమ్ గ్రీన్ అన్నారు.

Jim Green:అసలు ఏలియన్స్ అంటే ఏమిటి? అవి ఎక్కడుంటాయి? అసలు ఉంటాయా లేదా? అనే ఎన్నో ప్రశ్నలు చాలా సంవత్సరాలుగా శాస్త్రవేత్తల మనసుల్లో ఉండిపోయాయి. ఏలియన్స్ అనేవి ఉంటాయోమో అని పలు సందర్భాల్లో వారికి అనిపించినా.. దానిని నిరూపించగల పూర్తిస్థాయి రుజువు వారికి ఇంకా దొరకలేదు. అయితే త్వరలోనే మనుషులు.. ఏలియన్స్‌ను చూస్తారంటూ ఓ నాసా మాజీ శాస్త్రవేత్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనుషులు, ఏలియన్స్‌ను కలిసే రోజు దగ్గర్లోనే ఉందని నాసా మాజీ శాస్త్రవేత్త జిమ్ గ్రీన్ అన్నారు. 40 ఏళ్ల పాటు నాసాలో పనిచేసిన ఈయన.. నమ్మకంగా కొన్ని విషయాలను వెల్లడించారు. సూర్య కిరణాలు తాకేంత దగ్గరలో భూమితో పాటు అనేక గ్రహాలు ఉన్నాయని, అంటే భూమిలాగానే మరో గ్రహం కూడా ఉండే ఉంటుందని తెలిపారు గ్రీన్. అంతే కాకుండా అక్కడ తాగేందుకు నీరు కూడా ఉంటుందని చెప్పారు.

ఇప్పటికే వేరే గ్రహాల్లో నీటి జాడలు కనుక్కోవడానికి ఎన్నో పరిశోధనలు జరిగాయి. తాజాగా జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్‌ను కూడా దీనికోసమే కనిపెట్టారు శాస్త్రవేత్తలు. నీరు ఉంటే జీవం కూడా కచ్చితంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏలియన్స్ ఉంటాయని అన్నారు గ్రీన్. తాను జీవించి ఉండగానే ఏలియన్స్‌ను చూస్తానని కచ్చితంగా చెప్తున్నారు జిమ్ గ్రీన్. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఏలియన్స్ నిజంగానే ఉన్నాయంటూ సమాచారం రావచ్చేమో.

Tags

Read MoreRead Less
Next Story