ఐఫోన్‌ యూజర్లకు శుభవార్త.. ఇక నుంచి ఈ ఆప్షన్ కూడా..

ఐఫోన్‌ యూజర్లకు శుభవార్త.. ఇక నుంచి ఈ ఆప్షన్ కూడా..
Apple IPhone: ప్రపంచ మొబైల్ దిగ్గజం ఆపిల్ సంస్థ తమ యూజర్లకి శుభవార్తను అందించింది.

Apple IPhone: ప్రపంచ మొబైల్ దిగ్గజం ఆపిల్ సంస్థ తమ యూజర్లకి శుభవార్తను అందించింది. ఐఫోన్ యూజర్లకి యప్ స్టోర్ కొనుగోలులో బాగంగా చెల్లింపులలో మూడు కొత్త మోడ్ లని ప్రవేశపెటింది. యప్ స్టోర్ పేమెంట్ మెథడ్స్ ని సులభతరం చేస్తూ యూపీఐ, రూపే, నెట్‌ బ్యాంకింగ్‌ పేమెంట్స్‌ ఆప్షన్లను ఆపిల్‌ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ వంటి ఓఎస్ లలో ఎప్పటినుండి వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ని ఇప్పుడు ఆపిల్ తన యూసర్లకి అందుబాటులోకి తెచ్చింది. గతంలో క్రెడిట్‌, డెబిట్‌​ కార్డులతో మాత్రమే యాప్‌ స్టోర్‌, ఐట్యూన్స్‌లో చెల్లింపులు జరపడానికి అవకాశం ఉండేది.

తాజాగా ప్రేవేశపెట్టిన కొత్త ఫీచర్స్ ద్వారా యూపీఐ, రూపే, నెట్‌ బ్యాంకింగ్‌ పేమెంట్స్‌ ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చని ఆ సంస్థ తెలిపింది. దీంతో అధిక సంఖ్యలో ఆపిల్‌ యూజర్లకు ఐట్యూన్స్‌లో పాటలను కొనుగోలు చేయడం సులబతరం కానుంది. టెక్ దిగ్గజం కుపెర్టినో యాప్ స్టోర్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలిపింది. అయితే అప్‌డేట్‌ చేసిన ఐఓఎస్, ఐప్యాడ్‌, లో మాత్రమే ఈ ఫీచర్ని వినియోగించుకోవచ్చు అని ఆపిల్‌ పేర్కొంది.



Tags

Read MoreRead Less
Next Story