WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు.. టైమ్ లిమిట్ లేదు

WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు.. టైమ్ లిమిట్ లేదు
WhatsApp: ఇతరులకు పంపించిన మెసేజ్ లో తప్పులుంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ఉంది

WhatsApp: స్మార్ట్ ఫోన్ యూజర్లు వాట్సాప్ తో బాగా కనెక్ట్ అయిపోయారు. మాట్లాడడం కంటే ఓ మెసేజ్ పెడితే పనైపోతుందనుకుంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది. ఇప్పటికే వాట్సాప్. గ్రూప్ కాలింగ్, వాట్సాప్ పేమెంట్స్, డిలీట్ ఫర్ ఎవ్రీవన్, వాయిస్ మెసేజ్, మల్టీ డివైజ్ సపోర్ట్, ఫోటో ఎడిట్, వ్యూ వన్స్ వంటి ఎన్నో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకోస్తోంది మరి అవేంటో తెలుసుకుందామా..

నో టైమ్ లిమిట్

ఇతరులకు పంపించిన మెసేజ్ లో తప్పులుంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ఉంది. ఇంతకు ముందు టైమ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు అది లేదు.. ఆ మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.

ఏడాదికోసారి టర్మ్స్ ఆఫ్ సర్వీస్

వాట్సాప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ లో కూడా మార్పులు చేయనుంది. ఏడాదికోసారి యూజర్ కు గుర్తు చేసేందుకు ఇయర్లీ రిమైండర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ పేరుతో కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది.

రీడ్ లేటర్

ఆర్కైవ్ ఫీచర్లో కూడా మార్పులు రానున్నాయి. ఆర్కైవ్ పేరును రీడ్ లేటర్ గా మార్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్స్ తమకు నచ్చినప్పుడు ఆర్కైవ్ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో మెసేజ్ లను చూసుకోవచ్చు.

గ్రూప్ పోల్స్

దీంతో యూజర్స్ తమకు నచ్చిన అంశం గురించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. అయితే గ్రూప్ లో ఉన్న సభ్యులు మాత్రమే ఈ పోల్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

కమ్యూనిటీస్

కమ్యూనిటీ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. కమ్యూనిటీ నిర్వహించే వారిని మేనేజర్ అని పిలుస్తారు. కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్ లకు మెసేజ్ పంపలేరు. అలానే ఇతర సభ్యులతో సంభాషించాలా వద్దా అనేది కమ్యూనిటీ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

మెసేజ్ రియాక్షన్స్

మెసేజ్ రియాక్షన్ లో వేర్వేరు ఎమోజీలు ఉంటాయి. వాటిలో యూజర్ తనకు నచ్చిన ఎమోజీతో మెసేజ్ లకు రిప్తై ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుంది.

హైడ్ లాస్ట్ సీన్

వాట్సాప్ లో మనం చివరిగా ఎప్పుడు చూశామనేది ఇతరులకు తెలియకుండా ఉండేందుకు హైడ్ లాస్ట్ సీన్ ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. అది అందరికీ కాకుండా ఎవరైతే చూడకూడదనుకుంటామో వారి కాంటాక్ట్ బ్లాక్ చేయొచ్చు.

గ్రూప్ అడ్మిన్ కొత్త ఫీచర్

కొన్ని పోస్టులు గ్రూప్ అడ్మిన్ లను చిక్కుల్లో పడేస్తుంటాయి. పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే ఆ మెసేజ్ డిలీట్ చేయగలరు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త ఫీచర్ ఆ పోస్టులను అడ్మిన్ లు డిలీట్ చేయొచ్చు. గ్రూప్ అడ్మిన్ దాన్ని తొలగించారు అని మెసేజ్ కూడా కనిపిస్తుంది.

డాక్యుమెంట్ ప్రివ్యూ

వాట్సాప్ లో పంపే పీడిఎఫ్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్ ను ప్రివ్యూ లో చూసుకునే ఫెసిలిటీ వస్తుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. వాయిస్ కాలింగ్ కు కొత్త ఇంటర్ ఫేస్, చాట్ ఫేజ్ ఆప్షన్స్ లో ఉండే సెర్చ్ బార్ ను వీడియో కాలింగ్ ఐకాన్ పక్కకు మార్చడం, బ్రాడ్ కాస్ట్ లిస్ట్, న్యూ గ్రూప్ ఆప్షన్లను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి న్యూ చాట్ సెక్షన్ లోకి మారనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story