New Year 2023: ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే

New Year 2023: ఈ ఏడాది ఏదైనా చేదు అనుభవం ఉందా? అంటే అవుననే చెప్పాలి. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంలో ఎందరో కొట్టుకుపోగా, కొందరికి తీర్చని లోటును మిగిల్చిందీ. దీంతో ఈ సంవత్సరం ఓ యుగంలా గడిచింది. 2022 సంవత్సరానికి స్వస్ధిపలుకుతూ, కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి సమయం ఆసన్నమవుతోంది. ఏదేమైనా కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలివున్నాయి. అసలు నూతన సంవత్సరం ఏ దేశంలో మొదలవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూ ఇయర్ పార్టీ కోసం ఇంకెంతో సమయం లేదు. ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి యావత్త్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా యువత కొత్త కల్చర్‌కు తెరలేపుతున్నారు. పట్టణాలు, నగరాల్లో వేడుకలకు దూరంగా ఉంటూ, ఫాం హౌస్‌లు, రిసార్ట్స్, బ్యాంకెట్ హాల్స్‌ను ముందుగా బుక్ చేసుకుని న్యూఇయర్ కు వెలకమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నారు. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు అందరి కంటే న్యూఇయర్ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకునేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు.
నిజానికి ప్రపంచంలో అందరికంటే ముందు పసిఫిక్ సముద్రంలోని సమోవా ద్వీపంలో కొత్త సంవత్సరం వస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే ఆ ప్రాంతం న్యూ ఇయర్‌లోకి అడుగుపెడుతుంది. సో దీన్నిబట్టి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు అందరికంటే ముందుగానే మొదలవుతాయి. అక్కడ మనకంటే ఐదున్నర గంటల ముందే కొత్త సంవత్సరం మొదలవుతుంది. సిడ్నీ హార్బర్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అందరూ వీక్షిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com