NOTHING-2 ఫోన్ విడుదల, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

NOTHING-2 ఫోన్ విడుదల, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

వినియోగదారులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న Nothing Phone-2 విడుదలైంది. పలు వారాలుగా ఈ ఫోన్‌పై టీజర్లతో కంపెనీ ఆసక్తిని పెంచింది. Nothing-1తో పోలిస్తే ధరలు ఎక్కువగానే ఉన్నాయి. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్-1 చిప్‌సెట్, 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే వంటి ఫీఛర్స్‌తో వస్తోంది. జులై 21న మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఆరంభమవనుంది.



నథింగ్-2 ఫోన్ 3 వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ వేరియంట్ 44,999లు, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరింట్ 49,999లు, మూడవ వేరియంట్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌ సామర్థ్యంలో 54,999 ల్లో లభించనున్నాయి. స్లేట్ గ్రే కలర్, వైట్ కలర్లలో లభించనుంది. ఈ ఫోన్‌తో పాటుగా 1,999 విలువైన కేస్, 999 ల స్క్రీన్ ప్రొటెక్టర్, 2,499 విలువైన పవర్ అడాప్టర్ వస్తున్నాయి.

120Hz రిఫ్రెష్ రేట్‌, 1600 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది.


ఇక హార్డ్‌వేర్ విషయానికి వస్తే మధ్యస్థాయి ఫోన్లలో ఉపయోగించినట్లుగా కాకుండా ప్రీమియం క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌తో వస్తోంది. 45W PD ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీ సామర్థ్యం అందించనుంది. 0-50 శాతం ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లో అవనుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేయనుంది.

ఆండ్రాయిడ్ 13తో పనిచేసే Nothing 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ పనిచేయనుంది. 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్ అందించనున్నారు. సరికొత్త గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ సాయంతో అవసరమైన కాంటాక్టులు, యాప్ నోటిఫికేషన్లకు మాత్రమే వివిధ రకాలైన లైట్లు, సౌండ్లు పెట్టుకునే ఫీచర్ అందించనున్నారు.

ఫోటోలు తీయడానికి Sony IMX890 సెన్సార్‌తో ప్రధాన కెమెరా, 50MP సెన్సార్‌తో కూడిన కెమెరాను అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.

నథింగ్ ఫోన్లలో వినియోగదారుల్ని ఎక్కువగా ఆకర్షించేది పారదర్శకమైన ఫోన్ రూపమే. అది ఇప్పుడూ కొనసాగించారు. మొదటి ఫోన్ కంటే పొడవు, వెడల్పులు పెరగడంతో పాటు, మందం, బరువుగా అన్పిస్తోంది. చేతిలో చక్కగా ఇమిడిపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story