ఎదురుచూపులకు తెర.. విడుదలైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే..

ఎదురుచూపులకు తెర.. విడుదలైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే..
Ola Electric Scooter: వాహనదారుల ఎదురు చూపులకు తెర పడింది. ఎట్టకేలకు ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలైంది.

Ola Electric Scooter: వాహనదారుల ఎదురుచూపులకు తెర పడింది. ఎట్టకేలకు ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేసింది. ఓలా బైక్ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందే ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ ఓలా సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. కేవలం 24 గంటల్లో దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఈ క్రేజ్‌తో పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారిలో మునిగిపోయాయి. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి బైక్‌పై ఆసక్తిని పెంచింది.

ఓలా కంపెనీ తమ ఎలక్ట్రీక్ స్కూటర్ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. మోడల్ ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా మూడ్స్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. డిస్‌ప్లే థీమ్‌కి సరిపోయేలా విభిన్న ఓడోమీటర్ స్టైల్స్, సౌండ్‌లను కూడా అందిస్తుంది. ఓలా స్కూటీ ధర కూడా వినియోగదారులకు అందుబాటులోనే ఉంది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం..


-ఓలా ఎస్1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్ ధర)

-ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్ ధర)

-ఢిల్లీలో ఓలో స్కూటర్ ధర రూ. 85,099 నుంచి ప్రారంభమవుతుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌పై)

-మహారాష్ట్రలో రూ. 94,999 వద్ద ప్రారంభమవుతాయి.

-రాజస్థాన్‌లో రూ. 89,968 వద్ద ప్రారంభమవుతాయి.

-గుజరాత్‌లో రూ. 79,999 నుంచి ప్రారంభమవుతాయి.

-స్కూటర్ 190 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

-గరిష్ట వేగం గంటకు 115 కిమీ.

-స్కూటర్ 3 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

-మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్‌ మోడ్స్‌

-స్కూటర్ అద్భుత ఫీచర్‌తో పాటు క్రూయిజ్ కంట్రోల్ వంటి హిల్ హోల్డ్‌ ఉంది

-స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

-ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు.

-ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది.

-స్కూటర్‌లో అంతర్నిర్మిత స్పీకర్‌లు కూడా ఉన్నాయి. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

-ఓలా ఎస్1 బూట్‌లో రెండు హెల్మెట్‌లను నిల్వ చేసే సామర్థ్యం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story