Phone Tips in Rainy Season: తడిచిన ఫోన్‌కి ఛార్జింగ్.. చాలా డేంజర్ సుమా!

Phone Tips in Rainy Season: వర్షాకాలంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తడి చేతులతో స్విచ్ ఆన్ చేయడం వంటివి చేయకూడదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. బయటకు వెళ్లి వచ్చిన వారు ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని ఇంటికి రాగానే ఛార్జింగ్ పెడుతుంటారు.
అలాంటివి అస్సలు చేయకూడదు. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే పూర్తిగా తడి ఆరిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. ఒకవేళ ఫోన్ తడిస్తే వెంటనే స్విచ్ఛాఫ్ చేయాలి.. తడిగా ఉన్నప్పుడు వాడకపోవడమే మంచిది.
ఒకవేళ వర్షంలో బయటకు వెళ్లాల్సి వస్తే జిప్‌లాక్ పౌచ్ వాడడం అవసరం. ఇది ఫోన్ తడవకుండా కాపాడుతుంది. ఈ పౌచ్‌ల్లో సిలికా జెల్ వాడితే మరీ మంచిది. తడి నుంచి ఈ జెల్ అదనపు రక్షణ అందిస్తుంది.
వర్షంలో తడుస్తూ ఫోన్ మాట్లాడాలనుకుంటే ఇయర్ ఫోన్స్ ఉపయోగించండి. ఇవి వాటర్ ఫ్రూఫ్‌తో దొరుకుతున్నాయి. ఇవి కూడా మరీ ఎక్కువగా తడవకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో ఫోన్‌కు వాటర్ ఫ్రూఫ్ బ్యాక్ కేస్ వాడడం మంచిది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌కు రక్షణ దొరుకుతుంది. ఈ కవర్స్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా లభిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com