Mobile Phone: 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌ రియల్‌మీ నార్జో 60 ఫోన్‌ రిలీజ్

Mobile Phone: 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌ రియల్‌మీ నార్జో 60 ఫోన్‌ రిలీజ్
రూ.17,999 ప్రారంభ ధర

రియల్‌మీ ఇండియా నార్జో సిరీస్‌లో నార్జో 60 5G మోడల్ ఫోన్‌ని విడుదల చేసింది. నార్జో 60 5G, నార్జో 60 5G ప్రో రెండు మోడళ్లను విడుదల చేసింది. మీడియాటెక్ చిప్‌సెట్‌, కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో రానున్న ఈ ఫోన్లు రూ.17,999 ధరల నుంచి లభించనున్నాయి. ఈ ఫోన్ సెగ్మెంట్లలో 1టీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యంతో రానున్న మొదటి ఫోన్‌ ఇదే. అమెజాన్‌లో గురువారం నుంచి ప్రీ ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. జులై 15వ తేదీ అర్ధరాత్రి నుంచి సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

8GB, 12GB ర్యామ్ వేరియంట్లలో మాత్రమే లభించనున్నాయి. నార్జో 60 5G 8+128GB ధర రూ.17,999 కాగా, నార్జో 60 5G 8+256GB ధర రూ.19,999లో లభిస్తుంది. నార్జో 60 ప్రో 8+128GB ధర రూ.19,999 కాగా, 12+256GB వేరియంట్ 23,999, 1టీబీ సామర్థ్యంతో ఉన్న 12+1TB ఫోన్ వేరియంట్ ధర రూ.29,999లో లభించనుంది.

ప్రారంభ ఆఫర్‌గా 1000 విలువైన కూపన్ కంపెనీ ఇస్తోంది. ICICI, SBI క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తే రూ.1500 తక్షణ డిస్కౌంట్‌ని కూడా అందిస్తోంది.




రియల్‌మీ నార్జో 60 5G

రియల్‌మీ నార్జో 60 5G 6.43-అంగుళాల (2,400 x 1,080 పిక్సెల్‌లు) టచ్‌స్క్రీన్‌, SuperAMOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. 1,000Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ నూతనంగా ఆండ్రాయిడ్ 13 వర్షన్‌తో పనిచేసే Realme UI 4.0 తో పనిచేయనుంది. ఇన్‌బిల్ట్‌ 8GB ర్యామ్ ఉండగా, వర్చువల్‌గా మరో 8జీబీ ర్యామ్‌తో 16జీబీకి పెంచుకోవచ్చు.

బ్యాక్ కెమెరా 64-మెగాపిక్సెల్‌, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది. superVOOC టెక్నాలజీతో పనిచేసే 33W ఫాస్ట్ ఛార్జర్‌తో, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది.




రియల్‌మీ నార్జో 60 5G ప్రో

ఈ మోడల్‌ 6.7 అంగుళాల సూపర్అమోలెడ్ టచ్‌స్క్రీన్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 13తో రూపొందించిన రియల్‌మీ 4.0 UIపై పనిచేయనుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ 7050 చిప్‌సెట్‌ కలిగి ఉంది. ర్యామ్‌ని 24జీబీకి, ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 1టీబీ దాకా సపోర్ట్ చేస్తోంది.

100MP బ్యాక్ కెమెరాతో పాటు, ఫ్రంట్‌ కెమెరా 16MP నాణ్యతో రానుంది. superVOOC టెక్నాలజీతో పనిచేసే 67W ఫాస్ట్ ఛార్జర్‌తో, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది.


రియల్‌మీ నార్జో 60 5G స్పెసిఫికేషన్స్

Display- 6.43-inch

ప్రాసెసర్ -MediaTek Dimensity 6020

ఫ్రంట్ కెమెరా --16-megapixel

బ్యాక్ కెమెరా--64-Megapixel + 2-Megapixel

RAM-- 8GB

స్టోరేజ్-- 128GB, 256GB

బ్యాటరీ సామర్థ్యం-- 5000mAh

ఓఎస్-- Android 13

స్క్రీన్‌ నాణ్యత-- 1200x2400 pixels


రియల్‌మీ నార్జో 60 5G ప్రో

Display- 6.70-inch

ప్రాసెసర్ -MediaTek Dimensity 7050

ఫ్రంట్ కెమెరా --16-megapixel

బ్యాక్ కెమెరా--100-megapixel + 2-megapixel

RAM-- 8GB, 12GB

స్టోరేజ్-- 128GB, 256GB, 1TB

బ్యాటరీ సామర్థ్యం-- 5000mAh

ఓఎస్-- Android 13

స్క్రీన్‌ నాణ్యత-- 2412x1080 pixels




Tags

Read MoreRead Less
Next Story